తాజా వార్తలు

Sunday, 6 December 2015

కాలుష్య నివారణ చర్యలు బేష్-జస్టిస్‌ ఠాకూర్

కాలుష్య నివారణ కోసం ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఠాకూర్ పూర్తి మద్దతు పలికారుకారు వాడకం లేని రోజున తాను కాలినడకనైనా సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమని ఠాకూర్ అన్నారు.ఢిల్లీ సర్కారు నిర్ణయంతోనైనా రాజధాని నగరంలో కాలుస్యం తగ్గుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.రోజూ వినియోగించే వాహనాల సంఖ్యను తగ్గించేందుకు సరిబేసి సంఖ్యల విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాలనుకోవడాన్ని జస్టిస్ టీఎస్ ఠాకూర్ స్వాగతించారుకాలుష్య నియంత్రణలో  విధానం ఉపయోగపడేదుంటే తాను కూడా అనుసరిస్తాననితన పొరుగున ఉన్న జస్టిస్ ఏకే సిక్రీతో కారు పంచుకుంటానని చీఫ్ జస్టిస్ చెప్పారుఅనూహ్యరీతిలో వచ్చిన  ప్రతిస్పందనను ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్వాగతించారుచీఫ్ జస్టిస్ మద్దతును స్వాగతిస్తున్నాంఇది మాకెంతో ప్రోత్సాహకరంసుప్రీంకోర్టు జడ్జీలు కూడా కారు పంచుకోవడమనేది లక్షల మంది అనుసరించేందుకు స్ఫూర్తినిస్తుందిథ్యాంక్యూ మై లార్డ్స్ అని ట్వీట్ చేశారుకాలుష్య సమస్య తీవ్రంగా పరిణమించిందనిదీనిని నియంత్రించాల్సిన అవసరముందని జస్టిస్ ఠాకూర్ ఆదివారం జర్నలిస్టులతో భేటీ సందర్భంగా అభిప్రాయపడ్డారుసుప్రీంకోర్టు జడ్జీలు కూడా  విధానాన్ని అనుసరించి త్యాగచర్యలకు సిద్ధమవుతారా.. కారు పంచుకోవడాన్ని ఇష్టపడతారా అన్న ప్రశ్నకుకాలుష్యాన్ని తగ్గించేదుంటే మేమెంతో ఇష్టంగా  పనిచేస్తాం అని బదులిచ్చారుఇందులో కష్టమేం లేదుఇది కనీసంగా చేయాల్సిన పనిదీనిని త్యాగమనాల్సిన పనిలేదుజడ్జీలు కూడా ఇలా చేస్తున్నారని తెలిసేందుకు ప్రతీకాత్మకంగా స్పందించాల్సిన చర్య ఇది అని ఆయన అన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment