తాజా వార్తలు

Wednesday, 30 December 2015

గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల

గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. గ్రూప్-2 కేటగిరి పరిధిలోకి వచ్చే 439 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్-2తో పాటుగా మరో మూడు నోటిఫికేషన్లు విడుదల చేశారు. నాలుగు నోటిఫికేషన్లద్వారా మొత్తం 796 పోస్టులు భర్తీ చేయనున్నారు. పోస్టులకు గురువారంనుంచి ఫిబ్రవరి 9వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. గ్రూప్-2 పోస్టులకు ఏప్రిల్ 24, 25 తేదీల్లో రాతపరీక్ష నిర్వహిస్తారుwww.tspsc.gov.in వెబ్ సైట్లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గ్రూప్- 2లో అత్యధికంగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎస్ పోస్టులు 220 ఉన్నాయి. తరువాతి స్థానంలో 110 అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ (ఏసీటీవో) పోస్టులు ఉన్నాయివీటితోపాటుగా మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-3లో 19 పోస్టులు, సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్-2లో 23, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఈవో పోస్టులు 67 భర్తీ చేయనున్నారు. వ్యవసాయ శాఖలోని వ్యవసాయ విస్తరణాధికారులు గ్రేడ్-2 పోస్టుల భర్తీకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 311 పోస్టులకుగాను జనవరి 25లోగా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. పరీక్షను మార్చిలో నిర్వహిస్తారు. పరీక్ష తేదీని త్వరలో ప్రకటించనున్నారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్ అండ్ సీవరేజ్ బోర్డులో 44 టెక్నికల్ గ్రేడ్-2 పోస్టులను భర్తీ చేయడానికి కూడా నోటిఫికేషన్ జారీచేశారు. పోస్టులకు అర్హులైన అభ్యర్థులు జనవరి 28లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పరీక్షను కూడా మార్చిలో నిర్వహించనున్నారు. అయితే పరీక్ష తేదీని తరువాత ప్రకటిస్తారు. మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్ అండ్ సీవరేజ్ బోర్డులోనే రెండు డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. పోస్టులకు జనవరి 22లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పరీక్షను ఫిబ్రవరి 21 నిర్వహిస్తారు. వీటితో పాటుగా గురువారం మరికొన్ని పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లుగా సమాచారం.
 
« PREV
NEXT »

No comments

Post a Comment