తాజా వార్తలు

Saturday, 26 December 2015

సుసైడ్ ను అడ్డుకున్న అధ్యక్షుడు

టర్కీ  ఇస్తాంబుల్‌లో సుసైడ్‌ స్పాట్‌గా పేరుగాంచిన ఎత్తైన వంతెన బొస్పొరస్‌ బ్రిడ్జిపై ఓ సుసైడ్ ను అడ్డుకున్నడు ఆ దేశాధ్యక్షుడు. కొన్ని క్షణాల తరువాత ఆ యువకుడు కృతజ్ఞత భావంతో అధ్యక్షుడు రీసిప్‌ చేతిని ముద్దుపెట్టుకున్నాడు.దీని ఎత్తు 64 మీటర్లు(211 అడుగులు). తరుచూ ఆత్మహత్యలు చేసుకోవడానికి వచ్చేవారికి ఈ బ్రిడ్జి ఐకాన్‌గా మారింది. అలాంటి ప్రదేశంలోకి ఎక్కడినుంచి వచ్చాడో తెలియదు ఓ 30 ఏళ్ల యువకుడు.  శుక్రవారం ప్రార్థనలు ముగించుకున్న అనంతరం భారీ రక్షకదళాల వాహనాల నడుమ కారులో వెళుతున్న అధ్యక్షుడి రీసిప్‌కు ఆత్మహత్య చేసుకోబోతున్న ఓ యువకుడు తారసపడ్డాడు. వెంటనే కారును ఆపి యువకుడిని ఆత్మహత్య చేసుకోవద్దంటూ వారిస్తూ అడ్డుకున్నారు. యువకుడిని తీసుకురమ్మని సెక్యూరీటీ అధికారులను ఆదేశించారు.  కారులో కూర్చొని విండోలో నుంచి యువకునితో మాట కలిపారు. దాంతో యువకుడు కుటుంబ సమస్యలతో జీవితం మీద విరక్తి చెంది ఇలా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్టు చెప్పాడు. 
« PREV
NEXT »

No comments

Post a Comment