తాజా వార్తలు

Wednesday, 2 December 2015

విజయవాడలో రోడ్డుపై పదిలక్షల నోట్లకట్టలు

విజయవాడలో రోడ్డుపై పదిలక్షల నోట్లకట్టలు కనబడ్డాయి. మొగల్రాజపురం బాష్యం స్కూలు వద్ద పదిలక్షలతో ఉన్న ఓ బ్యాగు స్థానికుల కంట పడింది..రోడ్డు మధ్యన సంచి పడటంతో అందరూ వెళ్లి చూసేసరికి పదిలక్షల రుపాయలు అందులో ఉన్నట్లు గుర్తించారు..సాధారణ బట్టలబ్యాగులో ఉండటం విశేషం..పదిలక్షల రుపాయలను పోలీసులకు అప్పగించారు స్థానికులు..ఆ నగదు ఎవరివి అనేది పోలీసులకు ఇంకా తెలియలేదు..నగదు మాదేనంటూ ఎవరూ దాదాపు రెండు గంటలకు పైగా అవుతున్నా ఫిర్యాదు చేయలేదని సమాచారం..ఇటీవల విజయవాడ పరిసర ప్రాంతాల్లో రియల్ వ్యాపారం ఊపందుకోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, సామాన్యులకు లక్షలు, కోట్లు సాధారణమైపోయాయని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు...గతంలో హైద్రాబాద్ కోకాపేట రియల్ వ్యాపారం మాదిరే నేడు విజయవాడ, అమరావతి పరిసర ప్రాంతాల పరిస్థితి ఉందని రియల్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు..
« PREV
NEXT »

No comments

Post a Comment