Writen by
vaartha visheshalu
03:54
-
0
Comments
రామ్ గోపాల్ వర్మపై సినీ నటి శ్రీదేవి భర్త బోనీకపూర్ ఫైరయ్యారు. వర్మ వ్యవహార శైలిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 'రామ్ గోపాల్ వర్మ ఒక వెర్రి మనిషి' అని, 'అతనిది వికృత మనస్తత్వమని బోనీ పేర్కొన్నాడు. పబ్లిసిటీ కోసమే వర్మ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని అన్నారు. వివరాల్లోకి వెళితే... 'గన్స్ అండ్ థైస్' పేరిట రామ్ గోపాల్ వర్మ తన జీవిత కథ పుస్తకాన్ని తాజాగా విడుదల చేసిన విషయం విదితమే. అయితే అందులో నటి శ్రీదేవిపై తాను రాసిన అధ్యాయం 'ఆమెకు తాను రాసిన ప్రేమలేఖ లాంటిద'ని, 'ఆమె పట్ల తనకున్న ఆకర్షణ ఒక డ్రగ్స్ లాంటిదం'టూ ఈ సందర్భంగా వర్మ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు శ్రీదేవీ అంటే వర్మకు ఎంత ఇష్టమో..తనే చాలా సార్లు చెప్పాడు.
No comments
Post a Comment