తాజా వార్తలు

Tuesday, 1 December 2015

పడ్డానండీ ప్రేమలో అంటూ పెళ్లి వరకు వచ్చారు..

పడ్డానండీ ప్రేమలో చిత్రంలో రొమాన్స్ చేసుకున్న వరుణ్, వితిక పెళ్లి వరకు వచ్చారు. ఈ క్యూట్ కపుల్ తాజాగా నిశ్చితార్ధానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ప్రేమ ఇష్క్ కాదల్ చిత్రంలో హర్ష వర్ధన్ రాణేకు జోడిగా కనిపించిన వితిక తర్వాత వరుణ్ తోజంటగా నటించి ఆయన ప్రేమలో పడింది. వీరిరివురి వివాహనికి ఇరు కుటుంబాలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిశ్చితార్ధ వేడుక డిసెంబర్ 7 న జూబ్లిహిల్స్ క్లబ్ లో గ్రాండ్ గా జరిపేందుకు పలు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ ఎంగేజ్ మెంట్ కార్యక్రమం ఉదయం 8 గంట 32 నిమిషాలకు జరగనుండగా, ఈ వేడుకకు పలువురు సిని సెలబ్రిటీలు హాజరు కానున్నట్టు తెలుస్తోంది. ఇటీవల వరుణ్ సందేశ్ మామ మంచు అల్లుడు కంచు చిత్రంలో మోహన్ బాబు తనయుడి పాత్రను చేయగా, ఈ చిత్రం డిసెంబర్ 25 న విడుదల కానుంది.
« PREV
NEXT »

No comments

Post a Comment