తాజా వార్తలు

Wednesday, 2 December 2015

కృష్ణం రాజు,ప్రభాస్ ల 'దందా' మొదలాయనా?

బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ బాహుబలి 2 కోసం బాగా కసరత్తులు చేస్తున్నాడట. దాదాపు సంవత్సరం పాటు షూటింగ్ జరుపుకోనున్న బాహుబలి 2 లో ప్రభాస్ పాల్గోననుండగా, ఆ తర్వాతి సినిమా ఎవరితో చేస్తాడనే విషయాలపై ఆసక్తి నెలకొంది. అయితే బాహుబలితో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ప్రభాస్ అంతే రేంజ్ లో ఉన్న సబ్జెక్ట్ ని ఎంచుకుంటాడా,లేదంటే సింపుల్ సబ్జెక్ట్ తో అలరిస్తాడా అనే ప్రశ్నలు అభిమానుల మనసుల్ని తొలుస్తుంది .

ప్రభాస్ తర్వాతి సినిమా రన్ రాజా రన్ ఫేం సుజీత్ డైరెక్షన్ లో ఉంటుందని అప్పట్లో ప్రచారం జరిగింది.అయితే దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేకపోయిన సుజీత్, ప్రభాస్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నాడనే వార్త మాత్రం చక్కర్లు కొడుతుంది.అయితే ఇదిలా ఉండగా తన పెద్దనాన్న కృష్ణం రాజు డైరెక్షన్ లోను ఓ చిత్రం చేయాలని ప్రభాస్ భావిస్తున్నట్టు సమాచారం .

కృష్ణంరాజు గతంలో విశాల నేత్రాలు అనే నవల ఆధారంగా ప్రభాస్ తో ఓ చిత్రాన్ని తెరకెక్కించాలని ప్లాన్ వేశారు. కాని ఆ చిత్రం పట్టాలెక్కలేదు.అయితే ఛత్రపతి తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో ఒక్క అడుగు అనే చిత్రం ఉంటుందని కృష్ణం రాజు ప్రకటించారు,కాని ఆ చిత్రం కార్యరూపం దాల్చలేదు.ఇక తాజాగా తన సొంత బ్యానర్ గోపికృష్ణ మూవీస్ పై ప్రభాస్ హీరోగా దందా అనే చిత్రాన్ని రూపొందించాలని కృష్ణం రాజు భావిస్తున్నట్టు టాక్ .ఈ చిత్రానికి కృష్ణం రాజే దర్శకత్వం వహించాలనుకుంటుండగా, ఇటీవలే దందా అనే టైటిల్ ను ఛాంబర్ లో రిజిస్టర్ చేయించారు రెబల్ స్టార్ .

బాహుబలి 2 తర్వాత ప్రభాస్ సినిమా ఏమై ఉంటుందా అని అభిమానుల్లో ఆతృత పెరుగుతుండగా,ఈ లోపులో ప్రభాస్ తన తర్వాతి సినిమాలకు సంబంధించి ఏదైన విషయాన్ని అనౌన్స్ చేస్తాడా లేదా అనేది చూడాలి.
« PREV
NEXT »

No comments

Post a Comment