తాజా వార్తలు

Sunday, 6 December 2015

తాగేయండి నీళ్లు- తగ్గించండి కొవ్వు

రోజుకి 8 గ్లాసుల నీళ్లు తాగమని వైద్యులు ప్రతి ఒక్కరికి చెపుతుంటారు. కాని అన్ని నీటిని తాగాలా అని అందరూ బాధగా ముఖాన్ని పెడతారు. కాని ఈ అలవాటు ఆరోగ్యానికి ఎంతో మంచిది. అంత నీటికి ఒకసారే తాగలేము కదా. అందుకని దానికో ప్రణాళిక పెట్టుకుని అలవాటు చేసుకుంటే మీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. నిద్ర లేవగానే మామూలు మంచి నీళ్లు ఒక సీసాడు తాగండి. మలబద్ధకం ఉన్నవాళ్లూ దీనికి బదులు గోరువెచ్చటి నీళ్లు తాగవచ్చు. అల్పాహారం తిన్నాక ఒక గ్లాసు, మధ్యాహ్నం భోజనానికి ముందు ఒక గ్లాసు నీళ్లు తాగండి. ఇక భోజనం చేశాక ఒక గ్లాసు, వ్యాయామం చెయ్యటానికి 20 నిమిషాల ముందు రెండు గ్లాసులు తీసుకోవాలి. వ్యాయామం చేస్తున్నంత సేపూ కొద్దికొద్దిగా నీళ్లు తాగుతూ ఉండండి. ఎక్కువ మోతాదులో తాగద్దు. నీళ్లు ఉపయోగించటం బరువు తగ్గేందుకు. పొట్టనిండా తిన్నాక చల్లటి నీళ్లు తాగద్దు. మామూలు నీళ్లు మాత్రమే తాగండి. వ్యాయామం చేశాక 2-3 గ్లాసులు తాగొచ్చు.  మీ బ్యాగులో ఒక లీటర్‌ సీసా నీళ్లు తీసు కళ్తూ ఉండండి. ఖాళీ అవగానే మళ్లీ నింపండి. సాయంకాలం చిరుతిండి తినే ముందు ఒక గ్లాసు, రాత్రి భోజనానికి ముందు ఒక గ్లాసు భోజనం చేశాక ఒక గ్లాసు నీళ్లు గడగడ తాగేస్తే చక్కటి ఆరోగ్యం మీ సొంతం. కొవ్వును తగ్గించుకోండి. మరి నీళ్లు తాగేస్తరు కదండి.. 
« PREV
NEXT »

No comments

Post a Comment