తాజా వార్తలు

Wednesday, 2 December 2015

లోకేష్ ని దూరంగా పెడుతున్న బాబు!


జీహెచ్ఎంసీ ఎన్నికలు జనవరి నెలాఖరు కల్లా నిర్వహిస్తామని తెలంగాణ అధికార ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో ఎన్నికల్లో చేపట్టాల్సిన వ్యూహాల గురించి పార్టీలన్నీ ఇప్పటినుండే కసరత్తులు మొదలయ్యాయి. తెలంగాణలో అధికారపార్టీ టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే వరంగల్ ఉపఎన్నికల్లో గెలిచి.. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల్లో కూడా గెలవాలని తెగ ప్రయత్నాలు చేస్తుంది. ఇక టీడీపీ నుండి అయితే చంద్రబాబే ఏకంగా విజయవాడ నుండి వచ్చి మరీ హైదరాబాద్ లో రెండు రోజులు ఉండాలని నిర్ణయించుకున్నారు. అయితే చంద్రబాబు సంగతేమో కాని ఇప్పుడు అందరి దృష్టి మాత్రం లోకేశ్ మీద పడింది. ఈ ఎన్నికల్లో చంద్రబాబు ఎలాగు పార్టీ గెలుపు కోసం ప్రయత్నిస్తారు.. కానీ లోకేశ్ ఎంతవరకూ గెలుపుకోసం కృషి చేస్తారు..ఎన్నికల్లో ఆయన పాత్ర ఎంతమేరకు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. అంతేకాదు ఎలాగూ సీఎం ఏపీలో పరిపాలన బాధ్యతల్లో బిజీగా ఉంటారు కాబట్టి.. గ్రేటర్ ఎన్నకల బాధ్యత లోకేశ్ కు అప్పగిస్తే బావుంటుందని చెబుతున్నారట. కానీ చంద్రబాబు మాత్రం ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తుంది.
« PREV
NEXT »

No comments

Post a Comment