తాజా వార్తలు

Wednesday, 2 December 2015

చెన్నై ఎందుకు మునిగిందంటే..


దక్షిణ భారతంలో మెట్రో నగరమైన చెన్నై భారీ వర్షాల బీభత్సంలో ఎక్కువప్రాంతాలు నీటమునిగాయి. దాదాపు వందేళ్ల తరువాత ఇంతటి స్థాయిలో వర్షపాతం కురిసిందని వాతావరణశాఖ పేర్కొనడం గమనార్హం. దాదాపు కోటిమందికిపైగా ప్రజలు వరద బీభత్సంతో ఇబ్బందులు పడుతున్నారు. మీనంబాక్కంలోని అంతర్జాతీయ విమానాశ్రయంలోకి వర్షపునీరు ప్రవేశించడంతో విమాన సర్వీసులను నిలిపివేయడం గమనార్హం.నగరం వర్షపునీరులో మునగడానికి గల కారణాలను కొందరు పర్యావరణవేత్తలు విశ్లేషించారు.

* చెన్నై నగరంలో దాదాపు కోటిమందికిపైగా జనాభా నివసిస్తున్నారు. చెన్నై శివార్లలో గత రెండు దశాబ్దాలుగా రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం జోరుగా వుంది.
* అయితే జనాభా పెరిగినంతగా మౌలికవసతులు పెరగలేదు.
* నగరంలోని ప్రధానంగా మూడు నదులు ప్రవహిస్తున్నాయి. కొసస్తతలయర్‌, కూవుం, అడయార్‌ నదుల పరివాహక ప్రాంతాలు ఆక్రమణలతో కుచించుకుపోయాయి.
* బ్రిటిషు హయాంలో నిర్మించిన బకింగ్‌హామ్‌ కెనాల్‌ నగరంనుంచి వచ్చే వర్షపునీటిని తీసుకునేది. అయితే దీని నిర్వహణను పట్టించుకోలేదు.
* నగర ప్రణాళిక ఒక క్రమపద్దతిలో జరగలేదు. దీంతో భారీ వరదనీరు వస్తే బయటకు వెళ్లేందుకు మార్గంలేకుండాపోయింది.
* గత ప్రభుత్వ హయాంలో జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం నిధులతో కాల్వల పటిష్టతను ప్రారంభించారు. ఇందులో భాగంగా ఎలాంటి వరదనీరు వచ్చినా ఎలాంటి ఆటంకాలు లేకుండా సముద్రంలోకి వెళ్లే విధంగా కాల్వల నిర్మాణం.
* అయితే ఈ కాలువల నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయింది.
* నగరశివారు ప్రాంతాలైన వేలచ్చేరి, పాతమహాబలిపురం రోడ్డు ప్రాంతాల్లో పారిశ్రామిక, గృహ నిర్మాణాలు విపరీతంగా జరిగాయి.
* దాదాపు 5500 హెక్టార్లు వున్న వేలచ్చేరి చిత్తడి నేలలతో వుంటుంది. నగరం నుంచి వచ్చే వరద నీటిని ఈ నేలలు తమలో కలుపుకుంటాయి. అయితే ఈ చిత్తడినేలలు దాదాపు కనుమరుగుకావడంతో నగరం నుంచి వచ్చిన వర్షపునీరు అక్కడే నిలిచిపోయింది.
* నగరంలోని పలు ప్రాంతాల్లోని ప్రధాన కాలువల్లో చెత్త నిలిచిపోవడంతో వర్షపునీరు రోడ్లపైకి వచ్చింది.
* నగరంలో దాదాపు 600కు పైగా చెరువులు వుండగా ప్రస్తుతం ఆ సంఖ్య పదులకే పరిమిత కావడం గమనార్హం.
« PREV
NEXT »

No comments

Post a Comment