తాజా వార్తలు

Wednesday, 9 December 2015

మద్యం వ్యాపారాలపై జగన్ సేన కీలక నిర్ణయం

వైఎస్ ఆర్ కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుందా? ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంతరెడ్డి చేసిన ప్రకటన చూస్తే అలా అనిపిస్తుంది. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్య నిషేదానికి కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. అందువల్ల పార్టీ నేతలు ఎవరూ మద్యం వ్యాపారం చేయరాదని శ్రీకాంతరెడ్డి సూచించారు. ఒకసారి ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత మద్యం వ్యాపారంలో ఉండడం సరికాదని ఆయన అన్నారు.ఈ ప్రకటన శ్రీకాంతరెడ్డి స్వయంగా చేశారా?లేక జగన్ అనుమతితో చేశారా అన్నది తెలియదు.కాని ఇలాంటి ప్రకటనలు సాధారణంగా పార్టీ అధ్యక్షుడికి తెలియకుండా చేయరు. దీనిపై పార్టీలో ఆ వ్యాపారాలు చేసే నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

« PREV
NEXT »

No comments

Post a Comment