తాజా వార్తలు

Monday, 21 December 2015

టీమిండియాలోకి యూవీ మళ్లీ రీ ఎంట్రీ

 విజయ్ హజారే ట్రోఫీలో అద్బుత బ్యాటింగ్ తో అలరించి  యూవరాజ్ సింగ్ .. సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.. కఠినమైన ఆసీస్ టీ20 సిరీస్ కు ఎంపికయ్యాడు. ప్రమాదకర క్యాన్సర్ బారిన పడి కోలుకున్న తర్వాత మునుపటి ఆటతీరు ప్రదర్శించలేకపోయిన యూవీ.. టెక్నిక్ లోపంతో భారీ మూల్యమే చెల్లించుకున్నాడు.. నిలకడ ప్రదర్శించలేక జట్టులో స్థానం కోల్పోయాడు.. ఫామ్ కోసం దేశవాళీ క్రికెట్ లో ఆడినా ఫలితం లేకుండా పోయింది.. అయితే హైదరాబాద్ వేదికగా జరిగిన విజయ్ హజారే ట్రోఫీ యువరాజ్ కు మంచి బూస్టింగ్ ఇచ్చింది.. ఆడిన అన్ని మ్యాచ్ ల్లోనూ రాణించిన యువరాజ్.. సెలక్టర్లకు రేస్ లో నేను ఉన్నానంటూ ఉనికి చాటాడు. ఇక ప్రస్తుతం మంచి టచ్ లో ఉన్న యువరాజ్.. ఆసీస్ తో జరిగే మూడు టీ20ల్లోనూ రాణించాలని ఉవ్విళ్లూరుతున్నాడు.. 34 ఏళ్ల వయసులో ఉన్న యువరాజ్ ఈ సిరీస్ లో మెరిస్తే.. వచ్చే ఏడాది జరిగే వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకోవడం దాదాపు గా ఖాయమే..  
« PREV
NEXT »

No comments

Post a Comment