తాజా వార్తలు

Wednesday, 20 January 2016

మార్చి 25న వరల్డ్‌వైడ్‌గా 'ఊపిరి'

కింగ్‌ నాగార్జున, కార్తీ హీరోలుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మా బేనర్‌లో నిర్మిస్తున్న 'ఊపిరి' చిత్రాన్ని మార్చి 25న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చిత్రంలో నాగార్జునగారి క్యారెక్టర్‌ చాలా డిఫరెంట్‌గా వుంటుంది. ఇప్పటివరకు నాగార్జునగారి కెరీర్‌లో చెయ్యని ఓ డిఫరెంట్‌ క్యారెక్టర్‌ ఈ సినిమాలో చేస్తున్నారు. ఈ క్యారెక్టర్‌ అందర్నీ ఆకట్టుకునేలా వుంటుంది. 
కింగ్‌ నాగార్జున హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మించిన 'సోగ్గాడే చిన్ని నాయనా' సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదలై భారీ ఓపెనింగ్స్‌ సాధించడమే కాకుండా సంక్రాంతి విన్నర్‌గా ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తోంది. ఇండియాలోనూ, ఓవర్సీస్‌లో ట్రెమండస్‌ రెస్పాన్స్‌తో 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రం ప్రదర్శింప బడుతోంది. కింగ్‌ నాగార్జునతో 'ఊపిరి' చిత్రాన్ని నిర్మిస్తున్న పివిపి సినిమా అధినేత పివిపి 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రం సాధించిన ఘనవిజయానికి 'ఊపిరి' టీమ్‌ తరఫున శుభాకాంక్షలు తెలియజేశారు. 
ఈ సందర్భంగా పివిపి సినిమా అధినేత పివిపి మాట్లాడుతూ ''రొమాంటిక్‌ హీరో అక్కినేని నాగార్జునగారు నటించిన 'సోగ్గాడే చిన్ని నాయనా' 2016 సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచినందుకు చాలా సంతోషంగా వుంది. ఈ చిత్రం విడుదలైన అన్ని సెంటర్స్‌లో సూపర్‌హిట్‌ టాక్‌తో ప్రదర్శింపబడుతున్న ఈ చిత్రం ఇండియాలోనూ, ఓవర్సీస్‌లోనూ అద్భుతమైన కలెక్షన్స్‌ సాధిస్తోంది. 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రంతో ఇంతటి ఘనవిజయం సాధించిన అక్కినేని నాగార్జునగారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 

« PREV
NEXT »

No comments

Post a Comment