తాజా వార్తలు

Thursday, 7 January 2016

మహిళలకు ఇంకా అధికారం రావడం లేదు- కవిత

మహిళలు ఎంత అభివృద్ధిపథంలో దూసుకుపోతున్నా… రాజకీయపరంగా రిజర్వేషన్లు కల్పించినా.. ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినా.. బానిసలుగానే ఉంటున్నాం’ అని నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు.  మహిళలు తమ బాధ్యతల్ని పూర్తిగా నిర్వర్తిస్తూనే సమాజసేవకు కదులుతున్నారన్నారు. వచ్చే ఏడాది నుంచి కేజీ టు పీజీ విద్యను అమలు చేయడానికి ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన పనులు చేస్తోందని, మైనారిటీల కోసం ప్రత్యేక వసతిగృహాలను నిర్మించడం జరుగుతోందని, వాటి నిర్వహణ బాధ్యతల్ని ఎంపీపీలే చూసుకోవాలన్నారు.అంతా బాగానే ఉంది కానీ మరి బంగారు తెలంగాణలో మహిళకు సరైన గౌరవం దక్కటం లేదని,మంత్రి మండలిలో కనీసం ఒక్క మహిళకైనా స్థానం కల్పించలేదని కొందరు ప్రశ్నించగా,త్వరలో జరిగే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో దాదాపు 50 శాతం సీట్లను మహిళలకు కేటాయిస్తున్నట్లు ఎంపీ కవిత చెప్పారు.భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, సామాజిక ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా జాతీయ ఎంబీసీ సంక్షేమ సంఘం, మహాత్మా పూలే ఫౌండేషన్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లో 282 మంది మహిళా ఎంపీపీలకు ఆత్మీయ సత్కారం జరిగింది.  
« PREV
NEXT »

No comments

Post a Comment