తాజా వార్తలు

Thursday, 14 January 2016

“లచ్చిందేవికి ఓ లెక్కుంది”

                                                                                                      

 ‘’లచ్చిందేవికి ఓ లెక్కుంది’’ చిత్రం ఇటివలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.ఇప్పటికే ఏం.ఏం. కీరవాణి గారు సంగీతం అందించిన పాటలకు అధ్బుతమైన రెస్పాన్స్ వచ్చింది. జనవరి 29 న గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా నిర్మాత సాయి ప్రసాద్ కామినేని మాట్లాడుతూ.. ''మా బ్యానర్ లో వస్తున్న మొదటి సినిమా ఇది. జగదీష్ నా స్నేహితుడు, అతనిలో ఉన్న మంచి టెక్నీషీయన్ ని గుర్తించి ఈ సినిమా స్టార్ట్ చేశాను. ఆడియో ఫంక్షన్ లో రాజమౌళి గారి మాటలు వినగానే నా నమ్మకానికి బలం చేకూరింది. ప్రతి సన్నివేశాన్ని లింక్ చేస్తూ చాలా ఇంట్రెస్టింగ్ గా జగదీష్ తెరకెక్కించాడు. అందాల రాక్షసి తరవాత నవీన్ చంద్ర, లావణ్య త్రిపాఠి కలసి  నటిస్తున్న సినిమా ఇది. ప్రతి సన్నివేశంలో వారి  మధ్య  కెమిస్ట్రీ చాలా  బాగా  కుదిరింది. జనం  తెలుసుకోవాల్సిన కొత్త పాయింట్ తో, జనానికి అర్ధమయ్యే రీతి లో ‘కాన్ కామెడీ’ థ్రిల్లర్ గా ‘’లచ్చిందేవికి ఓ లెక్కుంది’’ నిర్మించాం. మా ఈ చిత్రంతో ఈ నెల 29న  మీ ముందుకు వస్తున్నాం. లచ్చిందేవి ఆశిస్సులు మీకు, మీ ఆశీర్వాదం మాకు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను'' అని అన్నారు. 
నవీన్‌చంద్ర, లావణ్య త్రిపాఠి, జయప్రకాష్‌రెడ్డి, బ్రహ్మాజీ, అజయ్‌, నర్రా శీను తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఎమ్‌.ఎమ్‌. కీరవాణి, పాటలు: శివశక్తిదత్తా, అనంతశ్రీరాం, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరావు, డిఓపి: ఈశ్వర్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఈ. మధుసూదన్‌రావు, 
నిర్మాత: సాయిప్రసాద్‌ కామినేని, 
రచన-దర్శకత్వం: జగదీశ్‌ తలశిల
« PREV
NEXT »

No comments

Post a Comment