తాజా వార్తలు

Tuesday, 5 January 2016

సంక్రాంతి బరిలో నాన్నకు ప్రేమతో..

ఎన్టీఆర్, విలక్షణ దర్శకుడు సుకుమార్ క్రేజీ కాంబినేషన్లోనాన్నకు ప్రేమతోఅనే సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే చిత్రంలో ఎన్టీఆర్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నాడుసంక్రాంతికి విడుదల చేస్తుండటంతో చిత్ర యూనిట్ కూడా సినిమా ప్రమోషన్స్ వేగాన్ని పెంచారు.  ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్స్తో విపరీతమైన అంచనాలను రేకెత్తించిన సినిమా ఎన్టీఆర్ కెరీర్లో మరో బ్లాక్బస్టర్ సినిమాగా నిలుస్తుందంటూ ప్రచారం పొందుతూ వస్తోంది. ఇక సినిమాపై ఉన్న అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు సుకుమార్ పకడ్బందీగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్ననాన్నకు ప్రేమతోచిత్రం విడుదల తేదీని నిర్మాత బీ.వి.ఎస్.ఎన్ ప్రసాద్ అధికారికంగా ప్రకటించాడు. ఇప్పటికే సంక్రాంతికి విడుదల అవుతుందో కాదో అనే సందేహాలు మరియు బాలకృష్ణడిక్టేటర్చిత్రం కూడా సంక్రాంతి బరిలో ఉండటంతో ఆలోచనలోపడ్డనాన్నకు ప్రేమతోచిత్ర యూనిట్ ఇక ఆలస్యం చేయకూడదని జనవరి 13 సినిమాని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలిపారుఇటివలే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లకు, టీజర్ లకు అభిమానుల నుండి మంచి స్పందన లభించింది. టెంపర్ చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన ఎన్టీఆర్నాన్నకు ప్రేమతోసినిమా విజయంతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తాని నిరుపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు


« PREV
NEXT »

No comments

Post a Comment