తాజా వార్తలు

Monday, 4 January 2016

వీరుడికి ఘన నివాళి

పంజాబ్లోని పఠాన్కోట్ ఉగ్రవాదుల ఏరివేత మూడో రోజు కూడా కొనసాగింది. నేషనల్ సెక్యూరిటీ గార్డ్వైమానిక దళంసైనిక విభాగాలకు చెందిన భద్రతా బలగాలు రాకెట్ లాంచర్ల వంటి భారీ ఆయుధ సంపత్తితో ఆపరేషన్లో పాల్గొన్నాయి. శనివారం నాడే నలుగురు ఉగ్రవాదులు హతమవగా.. నిన్న మరో ఇద్దరిని హతమార్చటంతో ఉగ్రవాదులను మొత్తంగా నిర్మూలించినట్లు పరిగణిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం, ఆర్మీ అధికారులు మాత్రం ఆపరేషన్పూర్తయిందని ఇంకా ప్రకటించలేదు.  పఠాన్ కోట్ఎయిర్ బేస్ లో చొరబడ్డ ఉగ్రవాదులను ఏరివేసేందుకు మరోసారి జవాన్లు తమ ప్రాణాలు సైతం లెక్క చేయలేదుదేశం కోసం ఎంతో అంకితభావంతో పనిచేస్తూ...విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారుఉగ్రవాదులతో పోరులో మొత్తం ఏడుమంది జవాన్లు మృతి చెందారుముష్కరులతో పోరాడి అమరులైన జవాన్లకు జనం కన్నీటి వీడ్కోలు పలికారు. సైనిక లాంఛనాల మధ్య వారికి అంత్యక్రియలు నిర్వహించారుపంజాబ్రాష్ట్రంలోని పఠాన్కోట్ ఎయిర్ బేస్పై దాడికి తామే బాధ్యులమని పాకిస్థాన్ ప్రేరేపిత యునైటెడ్ జిహాద్ కౌన్సిల్ ప్రకటించింది. వైమానిక స్థావరంపై దాడిలో కాశ్మీరీ తీవ్రవాదులే పాల్గొన్నారని సంస్థ తెలిపింది. వివిధ తీవ్రవాద గ్రూపులతో ఏర్పాటైన కశ్మీర్ ఉగ్రవాద సంస్థ యునైటెడ్ జిహాద్ కౌన్సిల్కు ఉగ్రవాది సయ్యద్ సలాహుద్దీన్ చీఫ్గా ఉన్నాడు. అయితే ప్రకటనను కేంద్ర ప్రభుత్వం మాత్రం కొట్టిపారేసింది. 

« PREV
NEXT »

No comments

Post a Comment