తాజా వార్తలు

Saturday, 2 January 2016

'పృథ్వీదత్తా..ఓ పరిచయం' టాకీ పూర్తి

అల్లు వంశ్‌, ప్రియాంక అగస్త్యన్‌ జంటగా...డబ్యూడబ్యూడబ్యూ మూవీస్‌ పతాకంపై దర్శకనిర్మాత పృథ్వీదత్తా నిర్మిస్తున్న చిత్రం ''పృథ్వీదత్తా..ఓ పరిచయం''. టాకీపార్ట్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దర్శకనిర్మాత పృథ్వీదత్తా మాట్లాడుతూ..' ఇది ఒక రొమాంటిక్‌ లవ్‌స్టోరీ. ఈ చిత్రంలో అద్భుతమైన పాటలుంటాయి. సంగీతం, కెమెరాల పనితనం హైలైట్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాము. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జనవరి 5 కి పూర్తవుతాయి. వెంటనే సినిమాని సెన్సార్‌కి పంపించనున్నాము. సెన్సార్‌ అనంతరం రిలీజ్‌ డేట్‌ ప్రకటిస్తాము. ఈ చిత్రం మాకు తప్పకుండా మంచి పేరు తెచ్చే చిత్రమవుతుందని ఆశిస్తున్నాము.  
« PREV
NEXT »

No comments

Post a Comment