తాజా వార్తలు

Thursday, 7 January 2016

పవన్ కళ్యాణ్ పై పిడమర్తి రవి తీవ్రమైన వ్యాఖ్య

సినీ నటుడు పవన్‌కల్యాణ్‌ పై తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, జాంబాగ్ డివిజన్ టీఆర్‌ఎస్ ఎన్నికల ఇన్‌చార్జి పిడమర్తి రవి తీవ్రమైన ఆరోపణలు చేశారు. టీడీపీ, బీజేపీ నాయకులు పవన్ కల్యాణ్‌ను రంగంలోకి దింపుతారని ప్రచారం జరుగుతోందని, ఆయన పవనిజం తెలంగాణలో పని చేయదని హెచ్చరించారు. జాంబాగ్ డివిజన్‌లోని న్యూ ఉస్మాన్‌గంజ్ రక్తమైసమ్మ దేవాలయం వద్ద నిన్న టీఆర్‌ఎస్ నాయకుల ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పిడమర్తి రవి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు సినిమాలు చూస్తేనే సినీ నటుడు పవన్‌కల్యాన్ ఎదుగుతున్నారన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ కోతలు లేని విద్యుత్, డబుల్ బెడ్‌రూం ఇళ్లు.. ఇలా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని గుర్తుచేశారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరారు. గోషామహల్ నియోజకవర్గం టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి ప్రేమ్‌కుమార్ ధూత్ మాట్లాడుతూ గోషామహల్ డివిజన్‌లోని అన్ని డివిజన్లలో టీఆర్‌ఎస్ విజయం తథ్యమన్నారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment