తాజా వార్తలు

Wednesday, 20 January 2016

రోజురోజుకు తగ్గుతున్న రూపాయి విలువదేశీయ కరెన్సీ విలువ మరింత క్షీణించింది. డాలర్-రుపీ ఎక్సేంజ్ రేటు 52 పైసలు క్షీణించి 68 స్థాయికి పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పవనాలు వీయడంతో కరెన్సీ విలువ 30 పైసలు(0.44 శాతం) క్షీణించి 67.95కి జారుకుంది. సెప్టెంబర్ 4, 2013న ముగిసిన స్థాయికి చేరుకుంది. ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులను ఉపసంహరించుకోవడంతో రూపాయికి మరింత చిల్లులు పడ్డాయని ఫారెక్స్ డీలర్ పేర్కొన్నారు. మంగళవారం 67.65 వద్ద ముగిసిన కరెన్సీ విలువ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. డాలర్తో పోలిస్తే ఇతర ఆరు కరెన్సీలు పతనాన్ని మూటగట్టుకున్నాయి
« PREV
NEXT »

No comments

Post a Comment