తాజా వార్తలు

Saturday, 9 January 2016

ఇందిరాగాంధీ హంతకులకు మద్దతా..!-వీహెచ్ కు బెదిరింపు కాల్

కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వీ హనుమంతరావుకు మరో చేదు అనుభవం ఏర్పడింది. కాంగ్రెస్ కు అత్యంత విదేయంగా ఉండే వీహెచ్ కు ఢిల్లీ నుంచి బెదిరింపు కాల్స్ రావడంతో ఆయన శనివారం పోలీసుల్ని ఆశ్రయించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నాయకత్వాన్ని బలపరచొద్దంటూ సంజనా చౌదరి అనే మహిళ ఫోన్ లో బెదిరించినట్లు, ఇందిరాగాంధీను చంపించిన సోనియాకు ఎందుకు మద్దతు ఇస్తున్నారంటూ ఆమె ఫోన్ లో నిలదీసినట్లు ...వీహెచ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. హైదరాబాద్ సీపీకి ఆయన ఫిర్యాదు చేయడటంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
« PREV
NEXT »

No comments

Post a Comment