తాజా వార్తలు

Monday, 4 January 2016

లంచగొండుల భరతం పడుతున్న ఏసీబీ

లంచగొండి అధికారులపై ఏసీబీ దాడులు ముమ్మరం చేసింది. విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని సంజీవ, శ్రీనివాస గ్రానైట్స్ కంపెనీలపై ఏసీబీ అధికారులు సోమవారం ఉదయం దాడులు నిర్వహించారు. సంస్థలకు యజమాని అయిన శ్రీకాకుళం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బాలానాయక్కు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు తమకు సమాచారం అందిందని... అందువల్లే భోగాపురంలో ఆయనకు చెందిన గ్రానైట్స్ కంపెనీలపై దాడులు నిర్వహిస్తున్నామని డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ తెలిపారు. లంచాలు తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment