తాజా వార్తలు

Saturday, 2 January 2016

బియాస్ నదిలో దుర్ఘటన బాధితులకు భారీ ఆర్థిక సాయం

బియాస్ నది దుర్ఘటనలో చనిపోయిన వీఎన్ఆర్ విజ్ఞానజ్యోతి ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులకు భారీగా నగదు ఇవ్వాలని హిమచల్ ప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇచ్చిందిఉన్న లార్జీ డ్యామ్ గేట్లను ఎత్తివేయడంతో కొట్టుకుపోయిన 24 మంది కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని హిమాచల్ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర విద్యుత్‌బోర్డు, విద్యార్థులు చదువుతున్న వీఎన్ఆర్ విజ్ఞానజ్యోతి ఇంజినీరింగ్ కాలేజీలను హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. ఘటన జరిగిన 19 నెలల తర్వాత శనివారం మేరకు కీలక తీర్పును వెలువరించింది. హిమాచల్‌ప్రదేశ్‌లో విజ్ఞాన విహార యాత్రకు వెళ్లిన వీఎన్ఆర్ కాలేజీకి చెందిన విద్యార్థులు మనాలీ వెళ్తూ మార్గమధ్యంలో 2014, జూన్ 8 సాయంత్రం మండీ జిల్లా థలాట్ వద్ద బియాస్ నదికి వెళ్లారు.  నది ఒడ్డున ఫొటోలు తీసుకుంటున్న సమయంలో ఎలాంటి హెచ్చరికలు లేకుండా లార్జీ జలవిద్యుత్ ప్రాజెక్టు ఆనకట్ట ఫ్లడ్‌గేట్లు ఎత్తివేయడంతో ఉన్నపళాన దూసుకొచ్చిన నీటి ఉధృతికి టూర్ ఆపరేటర్‌తోపాటు 23మంది విద్యార్థులు కొట్టుకుపోయారు. వీరిలో ఆరుగురు విద్యార్థినులు కూడా ఉన్నారు. దాదాపు నెలరోజుల అన్వేషణలో మృతదేహాలు అప్పుడొకటి అప్పుడొకటి బయటపడ్డాయి. ఘటనపై హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు మీడియా కథనాలను సూమోటోగా స్వీకరించి సుదీర్ఘ విచారణ జరిపింది. శనివారం తీర్పు వెలువరించిన చీఫ్ జస్టిస్ మన్సూర్ అహ్మద్ మీర్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్.. తాత్కాలిక సహాయం కింద ఇచ్చిన ఐదు లక్షలు కలుపుకొని 20 లక్షల నష్టపరిహారాన్ని తీర్పు వెలువడే నాటి వరకూ ఏడాదికి 7.5శాతం వడ్డీతో సహా చెల్లించాలని ఆదేశించింది

నష్టపరిహారం మొత్తాన్ని హిమాచల్‌ప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డు, వీఎన్ఆర్ కాలేజీ యాజమాన్యం, హిమాచల్ రాష్ట్ర ప్రభుత్వం 603010 నిష్పత్తిలో భరించాలని పేర్కొంది. మొత్తాన్ని బాధితుల కుటుంబ సభ్యులకు అందజేసేందుకు వీలుగా ఎనిమిదివారాల్లోగా కోర్టులో డిపాజిట్ చేయాలని వారిని ఆదేశించింది. దుర్ఘటనలో ప్రధాన బాధ్యత ఎలక్ట్రిసిటీ బోర్డుదేనని ధర్మాసనం అభిప్రాయపడింది.

నీళ్లు విడుదల చేసే ముందు బోర్డు అధికారులు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోలేదని పేర్కొంది. కనుక నష్టపరిహారంలో 60శాతం వారే భరించాలని స్పష్టంచేసింది. ఇంతకు ముందు 2014 జూన్ 25 మధ్యంతర ఉత్తర్వులు విడుదల చేసిన హిమాచల్ హైకోర్టు.. బాధిత కుటుంబాలకు తక్షణ పరిహారం కింద తలా ఐదు లక్షల చొప్పున చెల్లించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. మొత్తాన్ని తాజా తీర్పులో ప్రకటించిన 20 లక్షల నష్టపరిహారంలో సర్దుబాటు చేస్తారు.


« PREV
NEXT »

No comments

Post a Comment