తాజా వార్తలు

Friday, 1 January 2016

తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్ పథకాన్ని ప్రారంభించిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం రెండు పథకాలకు శ్రీకారం చుట్టింది. పశ్చిమగోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏలూరులో ఎన్టీఆర్ ఆరోగ్య భరోసా పథకంతోపాటు, తల్లీ బిడ్డ ఎక్స్ప్రెస్కు సంబంధించిన 102 సేవలను ప్రారంభించారు. 102 కాల్ సెంటర్కు చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రులలో పరిస్థితులను మెరుగుపరుస్తామని చెప్పారు. అలాగే ప్రజలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని, భోజనం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారుప్రైవేటు ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందిస్తామని, ఏపీని ఆరోగ్య ఆంధ్రప్రదేశగా మారుస్తామని  చంద్రబాబు నాయుడు వెల్లడించారుముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) విభాగాన్ని హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించాలని నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సీఎంఆర్ఎఫ్ విభాగాన్ని పర్యవేక్షిస్తున్న ఐఏఎస్ అధికారి రాజమౌళి విజయవాడలోనే ఉంటున్నారు. మంత్రులు కూడా దాదాపుగా అక్కడికే సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులను పంపుతున్నారు. సిబ్బంది మాత్రం హైదరాబాద్లో ఉండటం ఇబ్బందికరంగా మారడంతో నిర్ణయం తీసుకొన్నారు. అంతకుముందు సీఎం దంపతులు దుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేకపూజలు చేశారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment