తాజా వార్తలు

Friday, 1 January 2016

నుమాయిష్ 2016 ప్రారంభం


హైదరాబాద్ నాంపలిల్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నుమయిష్ 2016 ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించాఉ.  76 ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ లో ప్రభుత్వప్రైవేట్ స్టాళ్లలో పలు ఉత్పత్తులుసేవలను ప్రదర్శనకు ఉంచారు.  ఏళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలను చేపడుతున్న హైదరాబాద్ నాంపలిల్లోని ఎగ్జిబిషన్  సొసైటీని మంత్రి ఈటెల రాజేందర్ అభినందించారు. ఎందరో పేద విద్యార్థులు భారం లేకుండా చదువుకునేందుకు సొసైటీ విద్యాసంస్థలు దోహదపడుతున్నాయని కొనియాడారు. 46 రోజుల పాటు సాగే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన తర్వాత జరిగిన సభలో మంత్రి మాట్లాడారు. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఎగ్జిబిషన్గ్రౌండ్ స్థలంపై సొసైటీకి హక్కులు కల్పించేందుకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకున్నారని ఈటెల గుర్తు చేశారు. త్వరలోనే సంబంధిత పత్రాలను అందజేస్తామని ప్రకటించారు. ఎగ్జిబిషన్సొసైటీ జిల్లాల్లో కూడా తన సేవా కార్యక్రమాలను అందించాలని, దానికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని ఈటెల హామీ ఇచ్చారుసభ తర్వాత నిర్వాహకులు ప్రజలను ఎగ్జిబిషన్ సందర్శనకు అనుమతించారు
« PREV
NEXT »

No comments

Post a Comment