తాజా వార్తలు

Tuesday, 5 January 2016

జగన్ పెద్ద నాయకుడు కావాలి-దాసరి


వైఎస్ జగన్ ప్రముఖ దర్శక, నిర్మాత దాసరి నారాయణరావుతో భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని దాసరి నివాసంలో ఈ సమావేశం జరిగింది. వైఎస్ జగన్ తాను మర్యాదపూర్వకంగా కలుసుకున్నట్లు దాసరి నారాయణ రావు చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంతో తనకు విడదీయరాని బంధం ఉందని దాసరి తెలిపారు. ప్రజాసమస్యలపై పోరాటాలు చేస్తూ ఎస్ జగన్ మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారని దాసరి కితాబిచ్చారు. వైఎస్ జగన్ కు తన దీవెనలు ఎల్లవేళలా ఉంటాయని అన్నారు. వైఎస్ జగన్ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ...ఇంకా పెద్ద నాయకుడు కావాలని మనసారా ఆశీర్వదిస్తున్నానన్నారు. వైఎస్ జగన్ తో వెంట పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఉన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment