తాజా వార్తలు

Thursday, 14 January 2016

డిక్టేటర్ రివ్యూ

సంక్రాంతి బరిలో నిలిచిన బాలయ్య బాబు డిక్టేటర్  యావరేజ్ టాక్ తో నడుస్తున్నది. కథలోకి వెళితే.. బాలకృష్ణ  హైదరాబాద్ లోని ధర్మా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు చెందిన సూపర్ మార్కెట్ లో ఉద్యోగం చేస్తుంటాడు.   సాధారణ ఉద్యోగి.  తనకు తన పని తప్ప మరే పనిగురించి తెలియదు.  గొడవలంటే అసలు పడదు.  తన పనేదో తనదే తప్పించి.. మరో పని గురించి ఆలోచించడు.  ఇలా శాంతంగా బుద్దునిలా ఉండే ధర్మ.. కాత్యాయని ( అంజలీ) ఇంట్లోనే ఉంటాడు.  వీరిద్దరికీ పెళ్లి జరుగుతుంది.  అయితే, కాత్యాయని... ఉద్యోగబాధ్యతల రిత్యా వేరే ప్రాంతంలో ఉండాల్సి వస్తుంది.  దీంతో ఇంటికి సంబంధించిన అంశాలు అన్నింటిని ధర్మానే చూసుకుంటుంటాడు.  ఇలాంటి సమయంలో ధర్మా జీవితంలోకి ఇందు (సోనాల్ చౌహాన్) ప్రవేశిస్తుంది.  ఇక ఇందు బ్రదర్ వలన చిక్కుల్లో పడుతుంది.  విక్కీ గ్యాంగ్ నుంచి ఇందుకు సమస్య ఉత్పన్నమౌతుంది.  ఇందు అన్నయ్య కోసం ఇందునుని వేధింపులకుగురి చేస్తున్న సమయంలో సీన్ లోకి ధర్మ వస్తాడు.  తన రౌద్రప్రతాపాన్ని చూపిస్తాడు. ఇక ధర్మాని టీవీలో చూసిన ధర్మా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి రాజశేఖర్ ( సుమన్) ఢిల్లీ నుంచి పరుగుపరుగున హైదరాబాద్ వస్తాడు. ధర్మాను డిక్టేటర్ గా పరిచయం చేస్తాడు. డిక్టేటర్ ధర్మా గా ఎందుకు మారాడు..?రాజశేఖర్ కు ధర్మాకు సంబంధం ఏమిటి..? ఇందు ఎవరు..? అసలు డిక్టేటర్ ఏం చేసేవాడు..? అన్న విషయాలను తెలుసుకోవాలి అంటే సినిమా చూడాల్సిందే
ఎప్పటి లాగే బాలయ్య బాబు డ్యాన్స్, డైలాగ్, నటనలతో అదరగొట్టాడు. 
« PREV
NEXT »

No comments

Post a Comment