తాజా వార్తలు

Wednesday, 6 January 2016

అణుబాంబుకన్నా వెయ్యిరెట్లు శక్తి

ఉత్తర కొరియా మరో విధ్వంసకరమైన ఆయుధాన్ని పరీక్షించింది. అణుబాంబు కన్నా శక్తిమంతమైన హైడ్రోజన్ బాంబును పరీక్షించామని వెల్లడించింది. ప్రకటన జపాన్, దక్షిణ కొరియా సహా పలు దేశాల్లో ప్రకంపనలు సృష్టించింది. అయితే ప్రకటనను అమెరికా నమ్మడం లేదు అణ్వాయుధాన్ని ఉత్తర కొరియా పరీక్షించడం ఇది నాలుగోసారిదేశాధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఆదేశాలమేరకే హైడ్రోజన్ బాంబ్ను పరీక్షించినట్లు  వార్తా సంస్థ వెల్లడించిందితమ దేశం హైడ్రోజన్ బాంబ్ను తయారు చేసిందని కిమ్ గత నెలలోనే పేర్కొన్నారుఅయితే ఆయన మాటలను అమెరికా నమ్మలేదుమూడువారాల క్రితం హైడ్రోజన్ బాంబుపరీక్షకు అనుమతినిస్తూ ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ హడ్రోజన్ బాంబు పేల్చి  శబ్దంతో మనం పులకరించిపోయేలా 2016 సంవత్సరాన్ని ప్రారంభిద్దాంఅప్పుడు మన సామ్యవాదఅణ్వాయుధ గణతంత్రంవైపుకొరియా వర్కర్స్పార్టీ వైపు ప్రపంచం తన దృష్టిని సారిస్తుంది అని  అనుమతి పత్రంపై రాశారని కేసీఎన్ తెలిపింది 
మరోవైపు.. బాంబు పరీక్ష ఫలితంగా 5.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అమెరికాకు చెందిన జియోలాజికల్ సర్వే సంస్థ తెలిపింది.  

« PREV
NEXT »

No comments

Post a Comment