తాజా వార్తలు

Thursday, 7 January 2016

తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలికి త్వరలో ఎలక్షన్స్!

తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలిలో జరిగిన స్కామ్ పైన మరియు ఎలక్షన్స్ నిర్వహించని తీరుపై నిర్మాతలు హైకోర్ట్ లో రిట్ పిటీషన్ దాఖలు  చేయగా, 07.01.2016న హైకోర్ట్ మూడు వారాల లోపు తగిన చర్యలు తీసుకోమని ప్రభుత్వానికి మరియు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ కి ఆదేశాలు జారీచేయటం జరిగింది.
శ్రీ దాసరి నారాయణ రావు గారి అధ్యక్షతన,నిర్మాతల మండలి గత అధ్యక్షులు సభ్యులుగా వేసిన 'కమిటీ' దాసరి గారి నివాసంలో ప్రస్తుతం సమావేశం అయినారు.నిర్మాతల మండలి సభ్యుల కోరిక మేరకు 'స్కామ్' కి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయకుండా ఉన్న ప్రస్తుత కార్యవర్గాన్ని రద్దు చేస్తూ,ఎన్నికలు ఏర్పాట్లకు ఆదేశాలు జారీ చేస్తారని ఆశిస్తున్నామని తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి సభ్యులు కోరుతున్నరు.  
« PREV
NEXT »

No comments

Post a Comment