తాజా వార్తలు

Tuesday, 12 January 2016

రోజాను ఏలా సస్పెండ్ చేస్తారు అది చట్ట విరుద్ధం..జగన్

ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావుకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రతిపక్షనేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ లేఖ రాశారు. చట్ట విరుద్దంగా రోజాను సస్పెండ్ చేశారని లేఖలో పేర్కొన్నారు. వెంటనే రోజా పైన విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని ఆ లేఖలో కోరారు. రూల్  ప్రకారం ఒక సభ్యుడిని సస్పెండ్ చేయాలంటే ఓటింగ్ జరగాలన్నారు. రూల్ నెంబర్ 340 గురించి ఓసారి ఆలోచించాలన్నారు. రూల్ 340 ప్రకారం సభ్యుడిని ఓ సెషన్‌కు మాత్రమే సస్పెన్షన్ చేయవచ్చునని చెప్పారు. కానీ నిబంధనలకు విరుద్ధంగా రోజా పైన ఏడాది పాటు సస్పెన్షన్ వేటు విధించారని చెప్పారు.
« PREV
NEXT »

No comments

Post a Comment