తాజా వార్తలు

Sunday, 3 January 2016

మెదక్ జల్లాలో షర్మిళ పరామర్శయాత్ర

మెదక్ జిల్లాలో పరామర్శ యాత్ర లో మొదటి రోజు వైఎస్ షర్మిల పరామర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణాన్ని తట్టుకోలేక తనువు చాలించిన వారి కుటుంబ సభ్యులను... ఆమె  పరామర్శించారు. గజ్వేల్ నియోజకవర్గంలోని వర్గల్, కొండపాక మండలాల్లో  ఏడు కుటుంబాలను షర్మిల పరామర్శించారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్ నుంచి మేడ్చల్ మీదుగా మెదక్ జిల్లా దండుపల్లి షర్మిల చేరుకున్నారు.  వర్గల్ మండలం అంబర్‌పేట, మీనాజీపేటల్లో షర్మిలకు ఘనం స్వాగతం పలికారు. అభిమానులకు అభివాదం చేస్తూ.. మహిళలను షర్మిల అప్యాయంగా పలకరించారు.బాధల్లో ఉన్న కుటుంబీకులకు అండగా ఉంటామని దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ, వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల హామీ ఇచ్చారు. ధైర్యం కోల్పోవద్దని ఆపదల్లో స్థైర్యం కోల్పోవద్దని ఆమె భరోసా ఇచ్చారు. 
అంబర్‌పేటలో మన్నె జయమ్మ కుటుంబాన్ని పరామర్శించారు. మృతురాలి భర్త నాగమల్లేష్, కుమారులను పరామర్శించారు. జయమ్మ ఎలా చనిపోయింది ? అంటూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. వర్గల్‌లో మహానేత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే, కొండపాక మండలం మర్పడగ గ్రామంలో శ్రీపతి శకుంతల, బందారం గ్రామంలో నమిలె పోచయ్య కుటుంబీకులను షర్మిల పరామర్శించారు.
షర్మిల వెంట వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మెదక్ జిల్లా శాఖ అధ్యక్షుడు గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు కొండా రాఘవరెడి, కొమ్మెర వెంకట్‌రెడ్డి, ఏపీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి శైలజ చరణ్‌రెడ్డి, తెలంగాణ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి విజయ తదితరులు పాల్గొన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment