తాజా వార్తలు

Thursday, 7 January 2016

చంద్రబాబు పాలన అంతా మోసం మోసం, దగా దగా

ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చంద్రబాబు ప్రజలను మోసపుచ్చుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పాలన అంతా మోసం దగా అని విమర్శించారు. రైతుభరోసా యాత్రలో భాగంగా అనంతపురం జిల్లా ధర్మవరంలో రెండో రోజు వైఎస్ జగన్ పరామర్శయాత్ర కొనసాగిస్తున్నారు. ఈసందర్భంగా ధర్మవరం పట్టణంలో స్థానిక చేనేత కార్మికులతో వైఎస్ జగన్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ వైఎస్ జగన్ ఏమన్నారంటే...
 • ఎన్నికల ముందు చంద్రబాబు ఎన్నో మాటలు చెప్పారు. 
 • అధికారంలోకి వచ్చాక రైతులు, డ్వాక్రా అక్కాచెల్లెలు, చేనేతలు, ఆఖరికి చదువుకునే పిల్లలు, అవ్వతాతలను ఏవిధంగా మోసం చేశారో చూస్తున్నాం. 
 • ఎన్నికల ముందు ఏ టీవీ ఆన్ చేసినా ఆయన చేసిన ప్రసంగాలు వినిపించేవి. 
 • గ్రామాల్లో కట్టిన ఫ్లెక్సీలు, గోడల మీద రాసిన రాతలు కనిపించేవి 
 • బ్యాంకుల్లో బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని వినిపించేది .
 • రైతుల రుణాలు మాఫీ కావాలంటే బాబు రావాలి అని వినిపించేది. 
 • డ్వాక్రా రుణాలు మాఫీ కావాలంటే బాబు రావాలి అని వినిపించేది .
 • జాబు కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పారు. 
 • బాబేమో ముఖ్యమంత్రి అయ్యాడు. జాబులు ఇవ్వడం దేవుడెరుగు. ఉన్నవి ఊడబెరుకుతున్నాడు. 
 • ఉద్యోగం లేని వారికి రూ.2 వేలు  నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు. అదీ ఇవ్వడం లేదు. 
 • నిరుపేదలకు ఇళ్లు కట్టిస్తాం గుడిసెలు లేని రాష్ట్రం చేస్తామన్నారు. ఒక్క ఇళ్లైనా కట్టించాడా అని నేను అడుగుతున్నా. 
 • అవ్వతాతలను వదిలిపెట్టడం లేదు. పెన్షన్ ఇచ్చేది కొంత కత్తిరించేది ఎక్కువ
 • ప్రతి చేనేతకు ఇళ్లు, షెడ్డు కట్టిస్తానన్నాడు. ఒక్క ఇళ్లు, షెడ్డు కట్టించిన పాపాన పోలేదు.
 • ప్రతి చేనేతకు లక్షన్నర వడ్డీలేని రుణాలు ఇస్తానన్నాడు. ఎవ్వరికీ ఇవ్వడంలేదు.
 • చంద్రబాబు 20 నెలల పాలనలో ఒక్క ధర్మవరంలోనే  16 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే దేశచరిత్రలోనే ఎక్కడా ఇలా జరగలేదు.
 • చేనేత కుటుంబాల దగ్గరకు వెళ్లాం. వాళ్లకు చేసింది శూన్యం. చేనేతలను చంద్రబాబు పట్టించుకున్న పాపాన పోలేదు. 
 • ఒక్క బ్యాంక్ రుణాలు ఇవ్వడం లేదు. వారి బతుకులు దుర్భరంగా ఉన్నాయి.
 • మీరు పడతున్నఅవస్థలు బాబుకు వినిపించేవిధంగా చెప్పండి.
 • బాబుకు బుద్ధి వచ్చేవిధంగా గట్టిగా గడ్డి పెట్టండి.
 • దేవుడు చంద్రబాబుకు జ్ఞానోదయం చేస్తాడేమోనని ఆశిద్దాం 
« PREV
NEXT »

No comments

Post a Comment