తాజా వార్తలు

Saturday, 16 January 2016

కోర్టు మెట్లెక్కనున్న కరీష్మా కపూర్

బాలీవుడ్ నటి కరీష్మా కపూర్  కోర్టు మెట్లెక్కింది. కరీష్మా భర్త సంజయ్ కపూర్ భామపై ఘాటైన కామెంట్స్ చేసారుకరీష్మా తనని మనీ కోసమే చేసుకుందని తెలిపిన సంజయ్, పెళ్ళికి ముందు అభిషేక్ బచ్చన్తో కరిష్మా ఎఫైర్లు పెట్టుకుందని ఆరోపించినట్టు సమాచారం. సంప్రదాయంగా ఉండే తమ ఫ్యామిలీను గ్లామర్గా మార్చేందుకు తీవ్రంగా ప్రయత్నించదన్నాడు. తన పిల్లలు సమైరా, కియాన్లను తన తండ్రిని కలిసేందుకు కూడా అంగీకరించలేదని సంజయ్ పేర్కొన్నారు. భార్యగానే కాకుండా ఒక కోడలిగాను, తల్లిగాను కరిష్మా పూర్తిగా విఫలమైందంటూ సంజయ్ కోర్టుకు అందించిన పిటీషన్లో పేర్కొన్నట్టు సమాచారం. మరోవైపు సంజయ్ వాదనను కరిష్మా లాయర్లు తీవ్రంగా ఖండించారు. తప్పుడు వార్తలను ప్రచారం చేస్తూ కరిష్మా ఇమేజ్ను దెబ్బతీసేందుకు సంజయ్ ప్రయత్నిస్తున్నారని, కరీష్మా లాయర్లు వాదిస్తున్నారు. సంజయ్ చిన్న పిల్లల భవిష్యత్, వారి సంక్షేమం కూడా ఆలోచించకుండా ఇలా కామెంట్స్ చేయడం వారి మనోభవాలను దెబ్బతీయడం లాంటిదేనని కరీష్మా లాయర్లు ఆరోపించారు. కరీష్మా కపూర్ వైవాహిక జీవితం ఎటువైపు మలుపు తిరుగుతుందో వేచి చూడాలి. 
« PREV
NEXT »

No comments

Post a Comment