తాజా వార్తలు

Thursday, 7 January 2016

కిల్లింగ్ వీరప్పన్ రివ్యూ

మరోసారి రాం గోపాల్  వర్మ తన సత్తా చాటాడు. కిల్లింగ్ వీరప్పన్ అంటూ ప్రేక్షకులను కట్టిపడేశాడు. మూడు రాష్ట్రాల పోలీసుల్ని, ప్రజల్ని గడగడలాడించిన వీరప్పన్ ని పట్టుకోలేక చంపడం కోసం పోలీసులు వేసిన కకూన్ మిషన్ ఏంటి? దాన్ని ఎవరు ఎలా డీల్ చేసారు అనేదే సినిమా కథ.. సినిమాలో చెప్పిన కథా విషయానికి వస్తే.. పోలీస్ ఆఫీసర్ విజయ్ కుమార్ అండ్ టీం ఎలాగైనా పట్టుకోవాలని చూస్తున్నప్పుడు అతని సబార్డినేట్ అయిన ఎస్.పి (శివరాజ్ కుమార్) ప్లాన్ చెప్తాడు. మన ఆఫీసర్స్ అందరూ వీరప్పన్(సందీప్ భరద్వాజ్) ప్రాంతమైన ఫారెస్ట్ కి వెళ్లి అక్కడ చనిపోతున్నారు. కాబట్టి అతని ప్లేస్ లో మనం ఏమీ చేయలేం, అందుకే అతన్ని మనం బయటకి తీసుకు రాగలిగితే ఈజీగా చంపేయచ్చు అనే ఆలోచనతో ఒక ప్లాన్ వేస్తాడు. ప్లాన్ కోసం ఎన్.పి ఎవరెవర్ని వాడుకున్నాడు? ఫైనల్ గా ఎలా వీరప్పన్ ని అడవి నుంచి బయటకి తీసుకు వచ్చి, ఎలా అతన్ని చంపాడు అన్నదే సినిమా కథ. సినిమాలో వీరప్పన్ ని చంపిన్ మిషన్ ని మాత్రమే చూపడం వలన 'కిల్లింగ్ వీరప్పన్' అని టైటిల్ జస్టిఫికేషన్ ఇచ్చాడు.  
« PREV
NEXT »

No comments

Post a Comment