తాజా వార్తలు

Thursday, 14 January 2016

నాన్నకు ప్రేమతో రివ్యూ

సంక్రాంతి బరిలోకి సక్సెస్ ఫుల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు ఎన్టీఆర్, సుకుమర్. నాన్నకు ప్రేమతో, రెగ్యులర్ కమర్షియల్ సినిమా ఆశించే ఆడియన్స్ ను కాస్త నిరాశపరిచినా.. కొత్త కథా కథనాలను కోరుకునే వారిని మాత్రం అలరిస్తోంది. కథలోకి వెళితే.. ఎన్టీఆర్  లండన్ లో ఓ కంపెనీలో ఉద్యోగం కోల్పోయిన వ్యక్తిగా పరిచయం అవుతాడు. ఫస్ట్ సీన్ లోనే తన ఎమోషన్ ను దాచుకోకుండా బయటపెట్టేసే వ్యక్తిగా కనిపిస్తాడు అభిరామ్. ఉద్యోగం పోవటంతో తన లాంటి ఎంతోమంది నిరుద్యోగులతో కలిసి కెయంసీ పేరుతో ఓ కంపెనీ ప్రారంభిస్తాడు. అదే సమయంలో తన తండ్రి రాజేంద్ర ప్రసాద్ కు సీరియస్ గా ఉందని తెలియటంతో ఇంటికి వస్తాడు. తన అన్న రాజీవ్ కనకాల  ఇంట్లో తండ్రిని కలుసుకున్న అభిరామ్, ఆఖరి క్షణాల్లో ఆయన్ని ఆనందంగా ఉంచాలనుకుంటాడు. కోటీశ్వరుడైన రమేష్ చంద్ర ప్రసాద్, సుబ్రమణ్యంగా పేరు మార్చుకోవడానికి కారణమైన  జగపతిబాబు పతనమే తన తండ్రికి ఆనందాన్ని ఇస్తుందని తెలుసుకొని కృష్ణమూర్తి పని పట్టడానికి బయలుదేరుతాడు. ఈ ఆపరేషన్ లో తనకు సాయం చేయటం కోసం కృష్ణమూర్తి వల్లే నష్టపోయిన మరో ముగ్గురిని ఎంపిక చేసుకుంటాడు. కృష్ణమూర్తిని దెబ్బకొట్టాడానికి అన్నింటికన్నా సులభమైన మార్గం అతని కూతురిని ప్రేమించటమే అని  రకుల్ ప్రీత్ సింగ్ ను ప్రేమలోకి దించుతాడు. మిగితా స్టోరీ వెండి తెరపై చూడాలి మరి.. 
మొత్తానికి నాన్నకు ప్రేమతో అంటూ ఎన్టీఆర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. 
« PREV
NEXT »

No comments

Post a Comment