తాజా వార్తలు

Friday, 1 January 2016

నేను శైలజ రివ్యూ

రామ్ కొత్త సినిమ నేను శైలజ పర్వలేదు అనిపిస్తుంది. హిట్ లేక ఇబ్బందులు పడుతున్న రామ్ కెరిర్ కు ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్ నగర్ టాక్. రామ్, కీర్తీల చిన్నతనంలో సినిమా ప్రారంభమవుతుంది. చిన్నతనంలో ఇద్దరు స్నేహితులు. అప్పటి నుంచే శైలజ మీద ఎంతో ఇష్టం ఉన్నా, విషయాన్ని ఆమెకు చెప్పకుండా దాచిపెడతాడు. తరువాత ఎంతోమంది అమ్మాయిలకు తన ప్రేమను చెప్పినా.. ఎక్కడా వర్కవుట్ కాదు. దీంతో ప్రేమ మీద విరక్తి చెందిన హరి అమ్మాయిలకు దూరంగా ఉంటుంటాడు. హరి కుటుంబం వైజాగ్ వెళ్లిపోతుంది. హరి, శైలజ పెద్దవాళ్లవుతారు. అక్కడే పబ్లో డిజెగా పనిచేస్తుంటాడు హరి. వైజాగ్లో హ్యాపీగా గడిపేస్తున్న హరికి మళ్లీ శైలజ కనిపిస్తుంది. అయితే ఆమె తన చిన్ననాటి స్నేహితురాలు అని గుర్తించని హరి, మరోసారి ఆమెతో ప్రేమలో పడతాడు. అయితే తన గత అనుభవాల దృష్ట్యా ఆమెకు తన ప్రేమను చెప్పకుండా చాలా కాలం దాచి పెట్టి ఆమెతో స్నేహం చేస్తాడు. ఫైనల్గా రోజు వాళ్ల గతం గురించి తెలిసిపోతుంది. హరి, శైలజకు తన ప్రేమిస్తున్న విషయం చెపుతాడు. అప్పుడు శైలజ, హరి ప్రేమను అంగీకరించిందా.. తరువాత పరిణామాలేంటి అన్నది తెరపై చూడాల్సిందే కదా.. 
రేటింగ్: 3.5 /5.0


« PREV
NEXT »

No comments

Post a Comment