తాజా వార్తలు

Saturday, 2 January 2016

నల్గొండ జిల్లాలో అమానుషం

నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. కారు కట్టంగూర్ దగ్గర రోడ్డుపై నడిచి వెళ్తున్న వృద్ధుడిని ఢీకొట్టింది. దీంతో, వృద్ధుడు ఎగిరి కారుపై పడ్డాడు. మృతదేహం కారుపై ఉన్నా డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోయాడు. స్థానికులు వెంటపడి 10-12 కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత అయిటిపాముల దగ్గర కారుని అడ్డగించారు. డ్రైవరుని కొట్టి పోలీసులకు అప్పగించారు. కారుని ధ్వంసం చేశారు. కారు ఢీకొట్టిన వెంటనే వృద్ధుడు చనిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపారు
« PREV
NEXT »

No comments

Post a Comment