తాజా వార్తలు

Thursday, 14 January 2016

తెలంగాణకు 791 కోట్ల కరువుసాయం- కేంద్ర వ్యవసాయ మంత్రి ప్రకటన

తెలంగాణ రాష్ర్టానికి రూ.791 కోట్ల కరువుసాయం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు  కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్ ప్రకటన చేశారు. తెలంగాణకు కరువు సాయంపై ఏర్పాటైన అత్యున్నతస్థాయి కమిటీ సమావేశమై నిర్ణయం తీసుకుందని తెలిపారు. అవిభాజ్య ఏపీకి కూడా ఇంత సాయం లభించలేదని మంత్రి వ్యాఖ్యానించారు. కాగా, తెలంగాణకు కరవు సాయం అందజేయాలని కోరుతూ సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రి రాధామోహన్‌ సింగ్‌ కు లేఖ రాసిన విషయం తెలిసిందే. నిన్న మంత్రి హరీష్‌రావు కేంద్ర మంత్రిని వ్యక్తిగతంగా కలిసి కరవు తీవ్రంగా ఉన్న దృష్ట్యా ఎక్కువ సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
« PREV
NEXT »

No comments

Post a Comment