తాజా వార్తలు

Saturday, 9 January 2016

తొలి పోరులోనే టైటిల్ సాధించిన సానియా జోడీ

సానియా మీర్జా ఈ ఏడాది పాల్గొన్న తొలి టోర్నీలోనే టైటిల్ తో మెరిసిందిబ్రిస్బేన్ ఇంటర్నేషనల్ టైటిల్ ను సానియా-హింగిస్ జోడీ చేజిక్కించుందివరల్డ్ నంబర్ వన్ జోడీ ఫైనల్లో కెర్బర్-అండ్రియా పెట్కొవిక్ పై వరుస సెట్లలో గెలుపొందిందితొలి సెట్ ను 7-5తో నెగ్గి శుభారంభం చేసిన సానియా జోడీ.. రెండో సెట్ ను మరింత ఈజీగా 6-1తో నెగ్గి ఫైనల్ ముగించిందితొలి సెట్ లో కాస్త ప్రతిఘటన ఎదుర్కొన్న  వరల్డ్ నంబరవన్ జోడీ..  తరువాత రెండో గేమ్ ను మాత్రం ఎటువంటి అవకాశం ఇవ్వకుండా చేజిక్కించుకుందిఇది సానియా-హింగిస్ జంటకిది వరుసగా 26 విజయం.  దీంతో 2012లో సారా ఎరాని-రొబెర్టా విన్సీ (ఇటలీ)  జంట వరుసగా 25 మ్యాచ్ల్లో గెలిచిన రికార్డును సానియా-హింగిస్ జోడీ బ్రేక్ చేసింది.  ఇదిలా ఉండగా  ఇద్దరి కలిసి సాధించిన టైటిల్స్ సంఖ్యను 10కు పెంచుకుంది.

« PREV
NEXT »

No comments

Post a Comment