తాజా వార్తలు

Thursday, 14 January 2016

వరుసగా 29 విజయాలు-సానియా రికార్డు

వరుసగా 29 విజయాలు..  సానియా మీర్జా మార్టినా హింగిస్ తో కలిసి వరుసగా 29 విజయాలు సాధించిన సానియా మీర్జా.. టెన్నిస్ మహిళల డబుల్స్ లో ప్రపంచ రికార్డు సృష్టించింది. సిడ్నీ ఓపెన్ సెమీఫైనల్లో ఒలారు-ష్వెదోవా జోడీపై నెగ్గి వరుస విజయాల సంఖ్యను 29కు చేర్చారు. 22 ఏళ్లుగా గిగి ఫెర్నాండెజ్-నటాష జ్వెరెవా జోడీ పేరిట ఉన్న వరుస 28 విజయాల రికార్డును సానియా జోడీ బద్ధలు కొట్టింది. సరికొత్త రికార్డును తమపేర లిఖించారు. బ్రిస్బేన్ ఓపెన్ టైటిల్ సాధించి కొత్త ఏడాదిని ఘనంగా ఆరంభించిన తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా.. హింగిస్‌ తో కలిసి మరో టైటిల్‌ సాధించే దిశగా అడుగులు వేసింది. గత ఏడాది జోరును కంటిన్యూ చేస్తూ కొత్త ఏడాది, కొత్త సీజన్ ను టైటిల్ తో ప్రారంభించిన సానియా-హింగిస్‌ జోడీ.. సిడ్నీ ఇంటర్నేషనల్ టెన్నిస్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. సానియా జోడీకిది వరుసగా 29వ విజయం.  
« PREV
NEXT »

No comments

Post a Comment