తాజా వార్తలు

Wednesday, 6 January 2016

రేపటి నుంచి పండగ స్పెషల్ బస్సులు

సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్‌ నుండి వివిధ ప్రాంతాలకు 2,470 బస్సులు నడపాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయం తీసుకున్నది.  ఈ నెల 8 నుంచి 14 వరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు ప్రకటించింది. ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, దిల్‌సుఖ్‌ నగర్‌, ఉప్పల్‌, ఎల్బీ నగర్‌ తో పాటు నగర శివారులోని వివిధ ప్రాంతాల నుంచి బస్సులు నడుపుతామని ఆర్టీసీ తెలిపింది. ఖమ్మం, మహబూబ్‌ నగర్‌, కల్వకుర్తి, పరిగి, వికారాబాద్‌, తాండూరు, జహీరాబాద్‌, సంగారెడ్డి వైపు వెళ్లే బస్సులు ఎంజీబీఎస్‌ నుంచి బయల్దేరుతాయని వివరించింది. కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ వెళ్లే బస్సులు జేబీఎస్‌ నుంచి నడుపుతామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. వరంగల్‌, యాదగిరిగుట్ట వైపు వెళ్లే బస్సులు ఉప్పల్‌ బస్టాండ్‌ నుంచి నడుపుతామన్నారు. నల్లగొండ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు దిల్‌సుఖ్‌ నగర్‌ నుంచి నడుపుతామని చెప్పారు. వెన్నెల, గరుడ, అంతర్‌ రాష్ట్ర సర్వీసులు ఎంజీబీఎస్‌ నుంచి నడుపుతామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. కర్నాటక, మహారాష్ట్ర వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు ఎంజీబీఎస్‌ నుంచి నడుపుతామన్నారు. విజయవాడ, గుంటూరు వెళ్లే 150 స్పెషల్‌ సర్వీసులు ఎల్బీనగర్‌ నుంచి బయల్దేరుతాయన్నారు. కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, ఒంగోలు, నెల్లూరు వైపు వెళ్లే షెడ్యూల్‌, స్పెషల్‌ బస్సులు ఎంజీబీఎస్‌ నుంచి నడుపుతామని తెలిపారు. ఈ బస్సుల్లో www.tsrtconline.in ద్వారా ముందస్తు రిజర్వేషన్‌ చేసుకునే సదుపాయం కల్పించామని ప్రకటించారు.  
« PREV
NEXT »

No comments

Post a Comment