తాజా వార్తలు

Tuesday, 5 January 2016

పేదలందరికీ కళ్యాణలక్ష్మీ


రేషన్ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరికి కళ్యాణలక్ష్మీ పథకాన్ని అందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజలంతా ప్రత్యేక రాష్ట్రం వస్తే తమ బతుకులు బాగుపడతాయని ఆశించారని, ఇప్పుడు రాష్ట్రం ప్రజల ఆశలు, ఆకాంక్షల మేరకు ముందుకు పోతున్నదని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్రావు అన్నారు. 15 శాతం స్థిరమైన ఆర్థిక వృద్ధితో తెలంగాణ రాష్ట్రం ముందడుగు వేస్తున్నదని, దానికి అనుగుణంగా ప్రజలకు ఉపయోగపడే పనులు చేసుకుంటూ ముందుకు పోవాలని అన్నారు. ప్రజల అవసరాల మేరకు నిధులు ఖర్చు చేయాలనే ఉద్దేశ్యంతోనే కొత్త పంథాలో బడ్జెట్ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో పెద్ద నగరాలలో ఒకటైన వరంగల్తో పాటు చారిత్రక ప్రాముఖ్యం కలిగిన వరంగల్జిల్లా సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి వుందని, జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ సంకల్పాన్ని నెరవేర్చలన్నారు. వరంగల్నగరానికి టెక్స్టైల్ పార్కు వస్తున్నదని, హెల్త్యూనివర్సిటీ వచ్చిందని, డిపిఎస్‌, హెచ్పిఎస్లాంటి విద్యాసంస్థలు వస్తున్నాయన్నారు. ట్రైబల్యూనివర్సిటీని కూడా వరంగల్లోనే స్థాపించాలనే డిమాండ్ఉందన్నారు. వరంగల్అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తున్నదని, బడ్జెట్లో ప్రతీ ఏటా వరంగల్కు రూ. 300 కోట్లు కేటాయిస్తామన్నారు. కేంద్రం కూడా స్మార్ట్సిటీ, అమృత్ సిటీ కింద వరంగల్ను ఎంపిక చేసిందన్నారు. వరంగల్కోట, కాకతీయులు నిర్మించిన చెరువులు పర్యాటక రంగం అభివృద్దికి దోహదపడతాయన్నారు. త్వరలోనే వరంగల్ఔటర్రింగ్రోడ్డు నిర్మిస్తామని చెప్పారు. ప్రాజెక్టుల రీడిజైన్చేయడం వల్ల వరంగల్కు ఎక్కువ మేలు కలుగుతుందన్నారు.
"మిడ్మానేరుకు ఎల్లంపల్లి నుంచి నీరు వస్తున్నదని, దీనివల్ల వరంగల్కే ఎక్కువ మేలు కలుగుతుంది. రూ. 130 కోట్లతో ఎస్ఆర్ఎస్పి కాకతీయ కాలువ మరమ్మత్తులు చేస్తున్నాం. ఇంకా కాలువల మరమ్మత్తుకు ఎన్ని నిధులు కావాలన్నా ఇస్తాం. కాలువల్లో చెట్లు తొలగించాలి. పూడిక తీయాలి. సీజన్లోనే పనులు చేయాలి. మిషన్భగీరథ ద్వారా వరంగల్జిల్లాలోని ప్రతీ ఇంటికి మంచి నీరు ఇవ్వాలి'' అని ముఖ్యమంత్రి చెప్పారు.
"వరంగల్నగరం లోపల, పరిసరాల్లో ప్రభుత్వ భూములు గుర్తించాలి. వాటిలో పేదలకు డబుల్బెడ్రూమ్ఇండ్లు కట్టిస్తాం. నగరంలోని ఆటోనగర్ను సిటీ అవతల ఏర్పాటు చేస్తే బాగుంటుంది. వరంగల్సిటీలో బస్బేలు బాగాలేవు. స్మశాన వాటికలు, బరియల్ గ్రౌండ్స్బాగాలేవు. సానిటేషన్సరిగా లేదు. వీటిన్నింటినీ ప్లాన్ప్రకారం వృద్ది చేయాలి. మంచి కన్సల్టెన్సీని పంపుతాం. ప్రణాళిక ప్రకారం నగరాభివృద్ధి చేద్దాం. హెల్త్యూనివర్సిటీకి త్వరలోనే శంఖుస్థాపన చేస్తాం. వరంగల్ఎంజిఎంను మతా, శిశు సంరక్షణ కేంద్రంగా మార్చాలి. నిమ్స్తరహాలో మరో కొత్త ఆస్పత్రి ఏర్పాటు చేయాలి. దీనికి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేయాలి. ఎంజిఎంలో శిథిలావస్థలో వున్న భవనాలను తొలగించి, కొత్తగా టవర్స్నిర్మించాలి'' అని ముఖ్యమంత్రి అన్నారు.
వరంగల్సమగ్రాభివృద్ధికై హన్మకొండలో మంగళవారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. స్పీకర్ మధుసూదనాచారి, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి చందూలాల్‌, ఎంపీలు సీతారాం నాయక్‌, దయాకర్‌, సుధారాణి, ఎమ్మెల్యేలు టి. రాజయ్య, రెడ్యానాయక్‌, సురేఖ, దయాకర్రావు, వినయ్భాస్కర్‌, ఆరూరి రమేష్‌, ధర్మారెడ్డి, శంకర్నాయక్‌, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీలు బి.వెంకటేశ్వర్లు, కొండా మురళి, శ్రీనివాసరెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డి, కలెక్టర్కరుణ పాల్గొన్నారు.


మిషన్ భగీరథ(వాటర్ గ్రిడ్)
----------------------------
వరంగల్ జిల్లాలో జరుగుతున్న మిషన్ భగీరథ పనులను ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్రావు సమీక్షించారు. అధికారులు, వర్కింగ్ ఏజన్సీలతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా తొలివిడత 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు మంచినీరు అందించాలని నిర్ణయించామన్నారు. వరంగల్ జిల్లా జనగామ, పాలకుర్తి, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాలతో పాటు మెదక్ జిల్లా గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక, నల్గొండ జిల్లా ఆలేరు, భువనగిరి, తుంగతుర్తి నియోజకవర్గాలకు నాలుగు నెలల్లోనే మంచినీరు ఇవ్వాలన్నారు. పైపులైన్ల ఏర్పాటుతో పాటు అన్ని పనులు సమాంతరంగా జరగాలన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి వారం వారం కార్యాచరణ రూపొందించి, దానికి అనుగుణంగా పనిచేయాలని ఆదేశించారు. అధికారులు, వర్కింగ్ ఏజెన్సీల వెంటపడి పనులు చేయించే బాధ్యత ప్రజాప్రతినిధులు స్వీకరించాలన్నారు. వరంగల్ జిల్లాలో ఐదు సెగ్మెంట్ల ద్వారా పనులు జరుగుతున్నాయని, ఇన్ టేక్ వెల్స్, వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్లు, పైప్ లైన్స్, నల్లాలు, గ్రామాల్లో పైప్ లైన్స్ తదితర పనులను సిఎం సమీక్షించారు.
మండలానికి ఎక్కడి నుంచి నీరు తెస్తారు? వాటి పనుల పురోగతి అంశాన్ని సిఎం స్థానిక అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. పైప్ లైన్ నిర్మాణానికి రైట్ ఆఫ్ వే చట్టాన్ని తెచ్చినందున, రెవెన్యూ అధికారుల సహకారం తీసుకోవాలన్నారు. విద్యుత్ లైన్ల నిర్మాణం కూడా సిఎం సమీక్షించారు. పైప్ లైన్స్ నిర్మాణం అయిన వెంటనే నీరు ఇచ్చే విధంగా విద్యుత్ సరఫరా జరగాలని ఆదేశించారు. పాలేరు, ఎల్ఎండి, హెచ్ఎండబ్ల్యుఎస్, గోదావరి, మంగపేట సెగ్మెంట్ల ద్వారా జిల్లాలోని అన్ని మండలాలకు వచ్చే ఏడాది మార్చి నాటికి మంచినీళ్లు ఇచ్చే విధంగా కార్యాచరణ రూపొందించాలన్నారు.
నీటిపారుదల - మిషన్కాకతీయ
---------------------------------
మిషన్కాకతీయ మొదటి విడతలో చేపట్టిన 1,062 చెరువుల పునరుద్ధరణ పనులను, రెండో విడతలో చేపట్టే పనులను ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్రావు సమీక్షించారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా పనులు చేయాలని, గత ఏడాది చేపట్టిన పనులను మార్చి నాటికి పూర్తి చేయాలని, రెండో విడత కార్యక్రమం వెంటనే ప్రారంభించాలని, అన్ని పనులూ సమాంతరంగా జరగాలన్నారు. చెరువు భూములు కాపాడడానికి సర్వే నిర్వహించి, హద్దులు నిర్ణయించాలన్నారు. చెరువు చుట్టూ చెట్లు పెంచాలని చెప్పారు. పూడిక మట్టిని పొలాలకు తరలించాలని, పొలాలకు పనికి రాని మట్టితో పాడుపడిన బావి బొందలు పూడ్చాలని ఆదేశించారు. చెరువు హద్దులు నిర్ణయించడానికి ఔట్సోర్సింగ్ఏజన్సీలతో సర్వే చేయించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నదన్నారు. చెరువుల పునరుద్ధరణ, హద్దుల నిర్ణయంలో ఆయకట్టు దారులను భాగస్వామ్యం చేయాలన్నారు.
కళ్యాణలక్ష్మి - షాదీ ముబారక్ 
------------------------------
పథకం కింద అందే డబ్బులు పెండ్లికి ముందే అందించాలని, పెండ్లి చేసే ఆడపిల్ల తల్లికి డబ్బులు అందే విధానం రూపొందిస్తామన్నారు. పథకంలో ఎట్టి పరిస్థితుల్లో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చూడాలన్నారు.
భారీ నీటిపారుదల రంగం
-------------------------
ఎనిమిది వేల క్యూసెక్కుల సామర్థ్యం కలిగిన కాకతీయ కాలువల మరమ్మత్తులను సిఎం సమీక్షించారు. పూర్తి స్థాయి నీటి ప్రవాహ సామార్థ్యం ప్రకారం నీరు ప్రవహించేలా కాలువలు సిద్దం చేయాలన్నారు. మెయిన్కాలువతోపాటు, డిస్ట్రిబ్యూటరీలు, ఫీల్డ్కెనాల్స్ బాగు చేయాలని చెప్పారు. కాకతీయ కాలువకు ఎక్కడ పని చేయాలనే విషయంపై అంచనాలు రూపొందించాలన్నారు. దేవాదుల ప్రాజెక్టును ఉపయుక్తమైన ప్రాజెక్టుగా మార్చాలన్నారు. దేవాదుల కింద కట్టాల్సిన రిజర్వాయర్లకు భూసేకరణ జరపాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో రిజర్వాయర్లు లేకుండానే కాల్వలు తవ్వారని, ఇప్పుడు కాలువలన్నీ ఉపయోగంలోకి వచ్చే విధంగా రిజర్వాయర్లు నిర్మించాలన్నారు. ప్రాజెక్టుల రీడిజైన్ ద్వారా జిల్లా అంతటికి నీరందుతుందన్నారు. దేవాదులకు బ్యారేజ్ కట్టి ములుగు, నర్సంపేట, భూపాలపల్లి, పరకాల-మల్లన్నసాగర్, ద్వారా జనగామ, స్టేషన్ ఘనపూర్, కొంతమేర పాలకుర్తికి, ఎస్ఆర్ఎస్పి ద్వారా వర్థన్నపేట, పాలకుర్తి, మానుకోట, డోర్నకల్ నియోజకవర్గాలకు నీరు అందుతుందన్నారు. కరువు పరిస్థితులన్న జనగామ, స్టేషన్ ఘనపూర్, పాలకుర్తిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, దేవాదుల ద్వారా మూడు నియోజకవర్గాల్లో చెరువులు నింపాలని ఆదేశించారు. దేవాదుల, ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులను పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు అవసరమైన రిజర్వాయర్లు కట్టాలని చెప్పారు. ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం ప్రాజెక్టు కింద రొళ్లపాడు, బయ్యారం రిజర్వాయర్ల ద్వారా మహబూబాబాద్, డొర్నకల్ నియోజకవర్గాలకు సాగునీరు అందుతుందన్నారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ దాదాపు పూర్తయిందని, కాళేశ్వరం ప్రాజెక్టుపై త్వరలోనే మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుకుంటామని, వాటిపై అవగాహన కల్పించేందుకు త్వరలో ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. తులారాం ప్రాజెక్టు, గౌరారం ప్రాజెక్టులను మరింత ఉపయోగకరంగా మార్చాలని, జంపన్నవాగుపై, ఆకేరు వాగుపై చెక్ డ్యాములు నిర్మించాలన్నారు. భూ నిర్వాసితులకు మేలు కలిగే విధంగా భూ కొనుగోలు విధానం తెచ్చినందున, దానిని సరిగా వినియోగించుకుని ప్రాజెక్టులు వేగంగా నిర్మాణం పూర్తి చేయాలన్నారు. ఆర్ అండ్ ఆర్ విధానానికి బదులుగా భూమి విలువ, ఆస్తి పరిహారం, డబుల్ బెడ్ రూమ్ ఇంటి సొమ్ము, మూడూ ఒకేసారి చెల్లించాలన్నారు.


« PREV
NEXT »

No comments

Post a Comment