తాజా వార్తలు

Thursday, 3 March 2016

అవకాశమిస్తే సమగ్రాభివృద్ధి

గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే వరంగల్ సమగ్రాభివృద్ధికి కేంద్రం నుంచి అత్యధిక నిధులు మంజూరు చేయించుకునే అవకాశం ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో రూ.43 వేల కోట్లతో రోడ్ల అభివృద్ధికి కేంద్రం అంగీకారం తెలిపిందన్నారు. జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో బుధవారం వరంగల్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీట్ ది ప్రెస్‌లో కిషన్‌రెడ్డి మాట్లాడారు. టీఆర్‌ఎస్ నేతలకు ఎన్నికలప్పుడే పూనకమొస్తుందని, ఏవో హమీలు గుప్పిస్తూ  ఎన్నికలయ్యాక మరిచిపోతారని చెప్పారు.

2019 ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేసేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి రూ.1,200 కోట్లతో ఎయిమ్స్ ఆస్పత్రి, హార్టికల్చర్ వర్సిటీ, గిరిజన వర్సిటీ, ఫార్మాసూటికల్ రిసెన్స్ సెంటర్, ఈఎస్‌ఐ మెడికల్ కళాశాలను తీసుకువచ్చామన్నారు. పత్తి పరిశోధనా కేంద్రం ఏర్పాటు, విమానాశ్రయ పున రుద్ధరణకు చర్యలు చేపట్టామన్నారు. హైదరాబాద్‌లో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, వరంగల్‌లో టెక్స్‌టైల్ పార్కుకు కేంద్రం అంగీకారం తెలిపిందని వివరించారు. అమృత్ పథకం కింద వరంగల్ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. వరంగల్‌ను స్మార్ట్ సిటీగా రెండో జాబితాలో ప్రకటిస్తామన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment