తాజా వార్తలు

Thursday, 3 March 2016

మహాలక్ష్మీ బాలీవుడ్ ఎంట్రీ

తొలి సినిమాతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ మెహరీన్ బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతుంది. నాని హీరోగా తెరకెక్కిన 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' సినిమాతో మహాలక్ష్మీగా వెండితెరకు పరిచయం అయిన ఈ భామ, తన నటనతో ఆకట్టుకుంది. తెర మీద కాస్త బొద్దుగా కనిపించినా.., గ్లామర్ తో పాటు పర్ఫామెన్స్ లోనూ మంచి మార్కులు సాధించింది. దీంతో ఈ అమ్మడికి వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి.
 
ఇప్పటికే తెలుగులో కళ్యాణ్ రామ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాతో పాటు సాయిధరమ్ తేజ్, బీవీయస్ రవి కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాల్లో హీరోయిన్ గా ఫైనల్ అయ్యింది. వీటితో బాలీవుడ్ లోనూ ఓ సినిమాను అంగీకరించింది మెహరీన్. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ నిర్మాతగా తెరకెక్కిస్తున్న ఓ సినిమాలో పంజాబీ అమ్మాయిగా నటించనుంది మెహరీన్. పలు ప్రకటనల్లో నార్త్ ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ భామ ఇప్పుడు హీరోయిన్ గా అలరించడానికి రెడీ అవుతోంది.
« PREV
NEXT »

No comments

Post a Comment