తాజా వార్తలు

Thursday, 3 March 2016

పయ్యావుల లీల: ఎకరా 3.7 లక్షలే.!

టీడీపీ సీనియర్‌ నేత పయ్యావుల కేశవ్‌, ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో 4.09 ఎకరాల భూమిని కొన్నారు. ఆయనే స్వయంగా ఈ విషయాన్ని ఒప్పుకున్నారు. తన కుమారుడు విక్రమసింహ పేరుతో పయ్యావుల కేశవ్‌ ఈ భూముల్ని కొన్నారట. 2014 అక్టోబర్‌ 13న ఈ భూమికి రిజిస్ట్రేషన్‌ కూడా జరిగింది. 
వాస్తవానికి, 2013 తర్వాత ప్రస్తుత అమరావతి ప్రాంతంలో భూముల ధరలు అమాంతం పెరిగాయి. అంతకు ముందు కూడా అక్కడ ఎకరా భూమి అటూ ఇటూగా 5 నుంచి 10 లక్షల రూపాయల ధర పలికేది. 2013 తర్వాత అయితే ఎకరా భూమి ధర తక్కువలో తక్కువ కోటి రూపాయలు పలికింది. కానీ, కేవలం ఎకరా 3.7 లక్షల రూపాయల చొప్పున 4.09 ఎకరాల భూమిని మొత్తంగా 12.27 లక్షలకే పయ్యావుల కేవవ్‌ తన కుమారుడికి కట్టబెట్టారు. 
ఇది రాజధాని భూమాయ. కాదు కాదు, రాజధానిలో పచ్చ రాబందుల భూ మాయ అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి. ప్రస్తుతం రాజధాని నిర్మితం కానున్న తుళ్ళూరుకి అతి సమీపంలో ఈ భూమి వుంది. 2014 అక్టోబర్‌ 13న రిజిస్ట్రేషన్‌ జరిగిందంటే, ఆ సమయానికి అక్కడ భూముల ధరలు ఏ స్థాయిలో వున్నాయో అందరికీ తెల్సిన విషయమే. అయినా పయ్యావుల కేశవ్‌గారికి అతి తక్కువ ధరకే భూములు లభ్యమయ్యాయి. ఇది టీడీపీ చిత్రం. 
పయ్యావుల కుటుంబం భూమిని రిజిస్ట్రేషన్‌ చేసుకున్న సమయానికి గుంటూరు జిల్లాలోనే కాదు, కృష్ణా జిల్లాలో కూడా ఎక్కడా, 500 గజాల భూమి కూడా 12 లక్షలకు దొరకని పరిస్థితి. అంటే, అధికార పార్టీ నేతలకు మాత్రమే, రైతులు అప్పనంగా భూముల్ని కట్టపెట్టేశారని అనుకోవాలేమో.! రైతులు కట్టబెట్టేశారా.? రైతుల్ని భయపెట్టి భూముల్ని లాక్కున్నారనుకోవాలా.? ఏమిటీ మాయ.? నీతిమయ రాజకీయాలకు పెట్టింది పేరు.. అని చెప్పుకునే పయ్యావుల కేశవ్‌, అంత ఖరీదైన భూమిని, అంత చవగ్గా ఎలా సొంతం చేసుకున్నారో చెబితే, సగటు ప్రజానీకం కూడా భూముల్ని చవకగా కొనుగోలు చేసేసుకుంటారు కదా.! 
ఏం పయ్యావుల కేశవ్‌గారూ, ప్రజల కోసమే రాజకీయాలు చేస్తామంటున్న మీరు.. జనానికి ఆ కిటుకు చెబితే బావుంటుందేమో ఆలోచించి చూడండి.!
« PREV
NEXT »

No comments

Post a Comment