తాజా వార్తలు

Saturday, 28 May 2016

1 నుంచి ఐదో విడత రైతు భరోసా యాత్ర

అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన ‘అనంత’ రైతుల కుటుంబాలకు భరోసా కల్పించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన రైతుభరోసా యాత్రలో భాగంగా ఐదో విడత యాత్ర జూన్ ఒకటి నుంచి మొదలవుతుందని ఆ పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ తెలిపారు. ఈ వివరాలను శనివారం వారు విలేకరులకు వెల్లడించారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.

ప్రభుత్వం నుంచి ఆదరవు లేక రైతులు వరుసగా ఆత్మహత్యలకు తెగిస్తున్న నేపథ్యంలో ‘నేనున్నానని’ భరోసా కల్పించేందుకు వైఎస్ జగన్ భరోసా యాత్ర చేపట్టారని తెలిపారు. ఇప్పటి వరకూ జిల్లాలో నాలుగు విడతలుగా భరోసా యాత్ర నిర్వహించి 70 రైతు కుటుంబాలను పరామర్శించారని గుర్తు చేశారు.  ఐదో విడత యాత్ర తాడిపత్రి, కదిరి నియోజకవర్గాల్లో సాగుతుందన్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు, పార్టీ శ్రేణులు యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
« PREV
NEXT »

No comments

Post a Comment