తాజా వార్తలు

Wednesday, 18 May 2016

కాస్ట్యూమ్స్ కే కోటి రూపాయలు..?

ప్రజెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్టార్ గా ఉన్న మహేష్ బాబు లేటెస్ట్ సినిమా బ్రహ్మోత్సవంతో మరిన్ని రికార్డ్ లను టార్గెట్ చేశాడు. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో నాన్ బాహుబలి రికార్డులన్నింటినీ సొంతం చేసుకున్న మహేష్, తొలి రోజు హయ్యస్ట్ నెంబర్ షోస్ తో మరో రికార్డ్ కు రెడీ అవుతున్నాడు. ఇలా సినిమా రిలీజ్ విషయంలో ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకుంటున్న సూపర్ స్టార్, ఈ సినిమా మేకింగ్ విషయంలో కూడా అదే ఫార్ములాను ఫాలో అయ్యాడు.

సాధారణంగా ప్రతి సినిమాలో హీరో క్యారెక్టర్ కు 25 నుంచి 35 కాస్ట్యూమ్స్ ను వినియోగిస్తారు. కానీ బ్రహ్మోత్సవం సినిమాలో మాత్రం మహేష్ ఏకంగా 100 రకాల కాస్ట్యూమ్స్ లో కనిపించనున్నాడట. ఈ విషయాన్ని మహేష్ వ్యక్తిగత స్టైలిష్ట్ అక్షయ్ త్యాగి స్వయంగా తెలిపాడు. సింపుల్ గా కనిపిస్తూనే మహేష్ గ్లామర్ కు తగ్గట్టుగా కనిపించటం కోసం ఈ కాస్ట్యూమ్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారట. అంతేకాదు కేవలం మహేష్ వేసుకున్న దుస్తుల కోసమే ఏకంగా కోటి రూపాయలు ఖర్చు చేశారన్న టాక్ వినిపిస్తోంది.
« PREV
NEXT »

No comments

Post a Comment