తాజా వార్తలు

Monday, 2 May 2016

మే 15న ‘రైట్ రైట్’ ఆడియో రిలీజ్…

సుమంత్ అశ్విన్ హీరోగా, పూజ జవేరి కథానాయికగా నటించిన చిత్రం ‘రైట్ రైట్’. ‘బాహుబలి’ ప్రభాకర్ ఇందులో ముఖ్య పాత్రను పోషిస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా ఆడియో విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 15న హైదరాబాద్ లో ‘రైట్ రైట్’ సినిమా ఆడియో ఫంక్షన్ చేయనున్నట్లు చిత్రయూనిట్ తెలిపారు.
ఈ సందర్భంగా హీరో సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ.., “నా కెరీర్ లో ఇదొక విభిన్నమైన చిత్రం అని, ఇప్పటికే ‘అల్లి బిల్లి’ అనే వీడియో సాంగ్ ను రిలీజ్ చేశామని, ఈ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చిందని అన్నారు. మే 10న మా నాన్న ఎమ్మెస్ రాజు పుట్టినరోజు సందర్భంగా మరో వీడియో సాంగ్ ను రిలీజ్ చేస్తామని, మే 15న ఆడియో రిలీజ్ చేయనున్నట్లు” తెలిపారు. ఈ చిత్రానికి జే.బీ సంగీతాన్ని అందించారు. వంశీకృష్ణ నిర్మాణంలో మను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment