తాజా వార్తలు

Saturday, 21 May 2016

24 నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ

ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 24 నుంచి నిర్వహించనున్నామని జాయింట్‌కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. పరీక్షల నిర్వహణపై శుక్రవారం.. జిల్లా కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఈ నెల 24 నుంచి ఉదయం 9 నుంచి12 వరకు మెదటి సంవత్సరం పరీక్షలు, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు రెండో సంవత్సరం పరీక్షలు జరుగుతాయని తెలిపారు.

మొదటి సంవత్సరం పరీక్షలకు25975 మంది, రెండో సంవత్సరం పరీక్షలకు 10856 మంది హాజరవుతారని, ఇందుకు జిల్లా వ్యాప్తంగా 78 పరీక్ష కేంద్రాలను ఏర్పా టు చేసినట్లు  వివరించారు.  ఆర్‌ఐఓ పరమేశ్వరరెడ్డి, జెడ్పీ సీఈవో ఈశ్వర్, డీఈవో రవీంద్రనాథరెడ్డి, డీఎంహెచ్‌ఓ శారద, ఆర్టీసీ ఆర్‌ఎం వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

 
« PREV
NEXT »

No comments

Post a Comment