తాజా వార్తలు

Thursday, 5 May 2016

నర్సింగ్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్.. ముగ్గురి అరెస్ట్

నర్సింగ్ విద్యార్థినిపై ఆటోలో సామూహిక అత్యాచారం చేసిన ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.  షైజు, సుజిత్ తో సహా మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేశామని, ఈ వివరాల మేరకు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించినట్లు వార్కాల ఇన్ స్పెక్టర్ వినోద్ వివరించారు. దేశవ్యాప్తంగా ఈ హత్యాచార ఘటన కలకలం రేపింది. తిరువనంతపురం జిల్లా వార్కాల పట్టణ శివారులోని అయంతి వద్ద మంగళవారం ఈ ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బాధితురాలు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

దారుణం జరిగిందిలా..
19 ఏళ్ల దళిత విద్యార్థిని తిరువనంతపురంలోని కాలేజీలో బీఎస్సీ నర్సింగ్ రెండో సంవత్సరం చదువుతోంది. ఆమెకు షైజు అనే ఓ స్నేహితుడు ఉన్నాడు. ఆటోడ్రైవర్ అయిన ఇతను మంగళవారం తన ఆటోలో విద్యార్థినిని వార్కాలకు తీసుకెళ్లాడు. దారి మధ్యలో షైజు స్నేహితుడు సుజిత్ తో పాటు మరో వ్యక్తి కూడా ఆటో ఎక్కాడు. వార్కాల శివారులోని నిర్జన ప్రదేశంలో ఆటోను నిలిపి, బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. తీవ్రమైన భయంతో మూర్ఛకు గురైన ఆమెను అక్కడే వదిలేసి నిందితులు పారిపోయారు.
« PREV
NEXT »

No comments

Post a Comment